టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆరు పదుల వయస్సులో ఉన్నా కూడా ఎంత ఎనర్జీతో ఉంటాడో.. ఎంత యంగ్‌గా ఉంటారో చెప్పక్కర్లేదు. నాగార్జున ఈ వయస్సులో కూడా ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడం వెనక అమల స్పెషల్ కేర్ ఎంతో ఉంటుంది. దీనికి తోడు నాగార్జున డ్రెస్ మెయింటైన్స్ చూస్తే ఆయన ఇద్దరు కొడుకులను మించిన కుర్రాడిలో ఉంటాడు. బిగ్‌బాస్ షో హోస్ట్ చేసేటప్పుడు వేసుకునే షర్ట్స్ వరల్డ్‌లోనే టాప్ మోస్ట్ బ్రాండ్స్‌వి మాత్రమే వేస్తూ ఉంటాడు.
నాగార్జున కాస్ట్యూమ్స్ అన్ని కూడా చాలా స్టైలీష్‌గా ఉంటాయి. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు బిగ్ బాస్ షోలో నాగార్జునను మాత్రమే చూసేందుకు ఆ షో చూసే వీక్షకులు చాలా మందే ఉంటారు. నాగ్ ఒక్కో వారం ఒక్కో స్టైలీష్ డ్రెస్‌తో మనకు కనిపిస్తారు. గత వారం నాగార్జున వేసుకున్న ఓ షర్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. గత వారం నాగార్జున పైస్లీ సిల్క్ షర్ట్ వేసుకుని.. అదిరిపోయే లుక్‌తో మనలను మెస్మరైజ్ చేశారు.
దీని రేటు ఎంత ఉంటుందని కూడా కొందరు గూగుల్‌లో సెర్చ్ చేశారు. వీరు సెర్చ్ చేసిన లెక్కల ప్రకారం చూస్తే ఈ షర్ట్ రేటు $1,110 యూఎస్ డాలర్స్ అట. అదే ఇండియన్ కరెన్సీలో అయితే అక్షరాలా రు. 82, 211. వామ్మో ఒక్క షర్ట్ ఖరీదు ఏకంగా 82 వేలు అంటే మాటలేనా.. నిజం నమ్మాల్సిందే. నాగార్జునను 60 ఏళ్లలో కూడా 25 ఏళ్ల వాడిలా చూడాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా…!
ఇక నాగార్జున ఇద్దరు తనయులు అఖిల్, చైతు చేసిన బ్యాచిలర్, లవ్ స్టోరీ రెండు హిట్ అవ్వడంతో ఆయన ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారు. నాగ్ ప్రస్తుతం ది ఘోస్ట్ – బంగార్రాజు సినిమాలలో నటిస్తున్నాడు.