భారతీయ సినిమా పరిశ్రమలో ఎంత మంది అగ్ర దర్శకులు ఉన్నా కూడా సున్నితమైన కథలతో సినిమాలు తీసి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన దర్శకుడు మాత్రం మణిరత్నం. మణిరత్నంతో పని చేసేందుకు ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు వెయిట్ చేస్తూ ఉంటారు. ఓ దళపతి, ఓ నాయకుడు, సఖీ, గీతాంజలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు మణిరత్నం చెక్కిన శిల్పాలే. ఆయన పేరుకు మాత్రమే కోలీవుడ్ దర్శకుడు అయినా కూడా సౌత్ టు నార్త్ అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలతో సినిమాలు తీశారు.
ఆయనతో కలిసి పనిచేస్తే తమలో ఉన్న నటన ఎలివేట్ అవుతుందని భావించే హీరో, హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అది మణిరత్నం స్టైల్. ఎంతో మంది స్టార్ హీరోలతో ప్రయోగాలు చేసి వారిలో ఉన్న మరో యాంగిల్‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. మణిరత్నం ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అనుకునే హీరో, హీరోయిన్లు ఎంతో మంది ఉంటే .. ఓ హీరో మాత్రం మణిరత్నం పిలిచి ఛాన్స్ ఇస్తే నో చెప్పాడు.
ఆయన ఎవరో కాదు విలక్షణ నటుడు విక్రమ్.
విక్రమ్ 1990వ దశకంలో చిన్న హీరో. ఈ క్రమంలోనే మణిరత్నం హిందూ, ముస్లింల సోదర భావానికి ప్రతీకగా బొంబాయి సినిమా తీశారు. 1990 ల్లో ఈ సినిమా యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. అరవింద్ స్వామి – మనీషా కోయిరాలా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ముందుగా విక్రమ్‌ను నటించమని అడిగారట.
విక్రమ్ రిజెక్ట్ చేయడంతో ఆ లక్కీ ఛాన్స్ అరవింద్ స్వామిని వరించింది. దేశవ్యాప్తంగా సంచలనం అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మణిరత్నం సున్నితమైన టేకింగ్,, మనీషా కోయిరాలా అందచందాలు, మ్యూజిక్ హైలెట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత అరవింద్ స్వామి అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు.