మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో ఇంద్ర ఒకటి. 2002 జూలై 24న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌తో అశ్వనీదత్ నిర్మాణంలో బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే 122 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ఆడి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. అప్పట్లోనే ఈ సినిమా రు. 17 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసి ఫుల్ రన్‌లో రు. 29 కోట్ల షేర్ రాబట్టింది.
మృగరాజు, డాడీ లాంటి సినిమాలు నిరాశ పరచడంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో చిరంజీవి ఈ సినిమా చేశాడు. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు దర్శకుడు బి.గోపాల్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇంద్రలో హీరోయిన్‌గా సోనాలిబింద్రేతో పాటు ఆర్తీ అగర్వాల్ చేశారు. సోనాలి బింద్రే ఓ సీన్‌లో భాగంగా గంగా నదిలో మునగాల్సి వచ్చిందట. అయితే అలా చేయలేనని.. తాను నీళ్లలో మునిగి పైకి రాలేనని చెప్పిందట.
చాలా సేపు బ్రతిమిలాడిన దర్శకుడు గోపాల్ చివరకు మూడు కెమేరాలు పెట్టించాడట. ఒక్కసారి మునిగితే చాలని.. చెప్పారట. అయినా కూడా ఆమె ఒప్పుకోక బెట్టు చేస్తుండడంతో చివరకు కోపం వచ్చిన గోపాల్ తాను పేకప్ చెప్పేస్తానని సోనాలికి వార్నింగ్ ఇచ్చారట. చివరకు ఆమె ఎలాగోలా కష్టం మీద ఆ సీన్ పూర్తి చేసిందట.
ఇంద్రలో సోనాలిబింద్రే ప్రకాష్‌రాజ్ కుమార్తెగా నటించింది. అప్పట్లో దాయి దాయి దామ్మా అనే పాటకు సోనాలి. చిరు వేసిన వీణ స్టెప్ ఓ ట్రెండ్ సెట్ చేసింది.