నేచురల్ స్టార్ నాని నటించిన సినిమాలు ఇటీవల పెద్దగా హిట్ కాలేదు. మనోడు మీడియం రేంజ్ హీరోగానే మిగిలి పోతున్నాడు. వీ సినిమా టక్ జగదీష్ రెండు కూడా ఓటీటీలో వచ్చి యావరేజ్ అయిపోయాయి. అంతకు ముందు నాని నటించిన కృష్ణార్జున యుద్దం – దేవ్ దాస్ – గ్యాంగ్ లీడర్ సినిమాలు కూడా ప్లాపే. ఇక జెర్సీ సినిమాకు మంచి పేరు వచ్చినా బయ్యర్లకు లాసే. ఈ నేపథ్యంలోనే శ్యామ్ సింగ రాయ రిలీజ్ అవుతోంది.
అసలే కరోనా తర్వాత అన్ని సినిమాలకు పెద్దగా బిజినెస్ లేదు. ఇలాంటి టైంలో శ్యామ్ సింగకు ఏరియాల వారీగా భారీ రేట్లు చెపుతున్నారట. సుమారు రు. 50 కోట్ల ఖర్చుతో శ్యామ్ సింగ తెరకెక్కింది. ఒక్క ఆంధ్రా రైట్స్ ఏకంగా రు. 12 కోట్లు చెపుతున్నారట. సీడెడ్ రు. 5 కోట్లకు తగ్గం అని అంటున్నారట. అయితే బయ్యర్లు మాత్రం ఈ రేట్లు చూసి ముందుకు రావడం లేదట.
ఇప్పటికే డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్‌కు అమ్మేశారు. హిందీ డబ్బింగ్, శాటిలైట్ అమ్మాల్సి ఉంది. ఓవరాల్‌గా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ రెండూ కలిపి రు. 52 కోట్లకు పైగా రికవరీ కావాల్సి ఉంది. ఇక డిసెంబర్ 24న సినిమా రిలీజ్ చేస్తున్నారు. అయితే ముందు వారమే డిసెంబర్ 17న బన్నీ పుష్ప వేస్తున్నారు. మరి ఈ రేట్లు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రికవరీ కావడం కష్టమే.. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.