దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో హీరోగా కాదు.. చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేసేందుకు ఎంతో మంది స్టార్లు రెడీగా ఉంటారు. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషలకు చెందిన వారు కూడా ఇప్పుడు రాజమౌళి సినిమాలో చిన్న ఛాన్స్ వచ్చినా చాలనే అనుకుంటారు. అయితే సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్ మాత్రం రాజమౌళి సినిమాల్లో కనపడరు. సౌత్‌లో ప్రకాష్‌రాజ్ అందరు స్టార్ హీరోల సినిమాల్లో విలన్‌గానో లేదా మరో క్యారెక్టరో చేస్తూనే ఉన్నారు. 20 సంవత్సరాలుగా ప్రకాష్‌రాజ్ ఇక్కడ ఎంతో మంది స్టార్ హీరోలతో పాటు స్టార్ దర్శకులతో పనిచేశారు. కానీ రాజమౌళి సినిమాలో ఆయన కనపడలేదు.
దీనికి ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో ఓ టాక్ ఉంది. రాజమౌళి ఏ సినిమా అయినా కనీసం రెండు, మూడేళ్ల పాటు చెక్కుతారు. ప్రకాష్‌రాజ్‌ను తన సినిమాలో పెట్టుకుంటే ఆయనకు మంచి పాత్ర ఇవ్వాలి. ఆ పాత్ర కోసం తమతో కనీసం రెండేళ్లకు పైగానే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. బల్క్ డేట్లు ఇవ్వాలి.. అవన్నీ ప్రకాష్‌రాజ్‌కు కుదరవు. అందుకే రాజమౌళి ఇప్పటి వరకు ఆయన్ను తన సినిమాల్లో పెట్టుకోలేదనే అంటారు.
అప్పుడెప్పుడో మర్యాద రామన్న సినిమాలో చిన్న పాత్రలో కనిపించినా అది ఫుల్ లెంగ్త్ పాత్ర కాదు. ఇక ప్రకాష్‌రాజ్ షూటింగ్‌కు కూడా కరెక్ట్ టైంకు రాడన్న టాక్ ఉంది. కోట్లు పెట్టి సినిమాలు తీసే రాజమౌళికి అలా టైం పాటించకుండా షూటింగ్‌కు వస్తే కుదరదు.. కోట్లు నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే రాజమౌళి కూడా ప్రకాష్‌రాజ్‌కు తన సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర ఇవ్వలేదనే అంటారు.