టాలీవుడ్లో రాజమౌళి, వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ముగ్గురు అగ్ర దర్శకులే. ఈ ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్లు కొడుతూ ఉన్నారు. వీరిలో ఇప్పుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు సినిమా టేకింగ్‌ను నేషనల్ లెవల్ దాటించేస్తున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమాతో తానేంటో ఫ్రూవ్ చేసుకున్న రాజమౌళి యావత్ భారతదేశమే తెలుగు సినిమా రంగం వైపు చూసేలా చేస్తున్నారు.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తనదైన మాటల తూటాలతో మంత్రం వేస్తూ బ్లాక్బస్టర్లు కొడుతున్నారు. రాజమౌళి భారీ బడ్జెట్, విజువల్ వండర్స్‌తో తన సత్తా చాటుతుంటే త్రివిక్రమ్ సినిమాలు అన్ని మాటల మంత్రంతోనే ప్రేక్షకులను కట్టి పడేస్తుంటాయి. ఇక వినాయక్ ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస హిట్లు కొట్టి తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతోన్న పరిస్థితి.
అయితే ఇప్పుడు ఈ ముగ్గురు దర్శకులకు ఒకే కామన్ పాయింట్ ఉంది. ముగ్గురూ కూడా పశ్చిమ గోదావరి జల్లాకు చెందిన వారే. రాజమౌళిది ఉభయ గోదావరుల సరిహద్దుల్లో ఉండే కొవ్వూరు పట్టణం. అయితే మనోడి ఫ్యామిలీ రాయచూర్ వెళ్లడంతో అక్కడే పుట్టాడు. ఆ తర్వాత తన తండ్రి దగ్గర శిష్యరికం చేసి ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఉన్నాడు.
ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం వాసి. హాస్యనటుడు సునీల్‌తో కలిసి త్రివిక్రమ్ భీమవరం డీఎన్నార్ కాలేజ్‌లోనే చదువుకున్నాడు. త్రివిక్రమ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సోదరుడి కుమార్తెనే పెళ్లి చేసుకున్నారు. ఇక వినాయక్ పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం చాగల్లుకు చెందిన వారు. ఆయన సాగర్ దగ్గర సుధీర్ఘకాలం దర్శకుడిగా పనిచేసి ఆది సినిమాతో దర్శకుడు అయ్యారు.