టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ముక్కుసూటిగా ఉంటారు. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తు ఉంటారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎంతో మంది శత్రువులు తయారయ్యారు. లోపల దాచుకునే మనస్తత్వం కాకపోవడంతో ఆయన ముక్కుసూటిగా చెప్పే మాటలు ఇండస్ట్రీలో చాలా మందికి నచ్చవు. ఇదిలా ఉంటే ఆయన ఓ హీరోయిన్ చెంప పగలకొట్టారన్న వార్తలు ఒకప్పుడు ఇండస్ట్రీలో సంచలనం అయ్యాయి.
ప్రస్తుత మా అధ్యక్షుడు విష్ణు తొలి సినిమా విష్ణు. ఈ సినిమాను లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై మోహన్‌బాబు స్వయంగా నిర్మించారు. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మళయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకుడు. ఇస్మాయిల్ దర్బార్ సంగీతం అందించారు. ఈ సినిమాలో విష్ణు పక్కన సాక్షి శివానంద్ చెల్లి శిల్పా శివానంద్ హీరోయిన్గా నటించింది.
ఆ సినిమాయే విష్ణుతో పాటు శిల్పకు కూడా తొలి సినిమా. అయితే ఆమె డైరెక్టర్ చెప్పినట్టు చేయకపోవడంతో పాటు సినిమా యూనిట్‌ను ఇబ్బందులు పెట్టేదట. దీంతో కోపం వచ్చిన మోహన్‌బాబు ఆమెకు పదే పదే చెప్పి చూశాక కూడా మార్పు రాకపోవడంతో అసహనంతో ఆమెపై చేయి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇది అప్పట్లో ఓ సంచలనం అయ్యింది. ఇక విష్ణు సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.