నందమూరి వంశంలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నందమూరి కళ్యాణ్‌రామ్. సినిమాలు హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా తన తాత ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తూ వస్తున్నాడు. కళ్యాణ్‌రామ్ నటించిన సినిమాల్లో ఎక్కువుగా ఆయన నిర్మాతగా చేసినవే. కళ్యాణ్ తన బ్యానర్లో తానే హీరోగా చేయడంతో పాటు ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలు చేశాడు. అయితే కళ్యాణ్‌రామ్ ఓ సినిమా విషయంలో ఓ డైరెక్టర్‌ను గుడ్డిగా నమ్మికోట్లు ఖర్చు పెట్టేశాడు. దీంతో కళ్యాణ్ కోట్లు పోగొట్టుకోవడంతో ఆస్తులు తాకట్టు పెట్టడం, మరి కొన్ని అమ్ముకునే వరకు పరిస్థితి వచ్చేసింది.
సురేందర్‌రెడ్డిని కళ్యాణ్‌రామ్ 2005లో డైరెక్టర్‌గా పరిచయం చేశాడు. అతనొక్కడే సురేందర్‌రెడ్డికి తొలిసినిమా. సురేందర్‌రెడ్డి కళ్యాణ్‌రామ్‌ను కలిసి ఓ బ్లాక్‌బస్టర్ హిట్ ఇస్తానని చెప్పడంతో రవితేజ హీరోగా కిక్ 2 సినిమా తీశారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చూసుకునే వ్యవహారం కూడా కళ్యాణ్‌రామ్ సురేందర్‌రెడ్డి మీద పెట్టేశాడు. సురేందర్‌పై ఉన్న నమ్మకంతో కళ్యాణ్ ఖర్చు ఎంతవుతోంది ? ఏంటి ? అన్నది అస్సలు చూడలేదు.
అయితే సురేందర్‌రెడ్డి చాలా బాధ్యతా రాహిత్యంగా ఈ సినిమాను తీశారు. విపరీతంగా ఖర్చు పెట్టించేశాడు. సినిమా మూడు గంటలకు పైగా వచ్చింది. డ్యూరేషన్ తగ్గించేందుకు దర్శకుడు ఒప్పుకోలేదు. కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని మళ్లీ షూట్ చేశారు. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో కళ్యాణ్ ప్రతి విషయానికి ఓకే చెప్పాడు. చివరకు ఖర్చు రు. 40 కోట్లు దాటింది. సినిమా డిజాస్టర్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ భారీగా నష్టపోయాడు.. చాలా ఆస్తులు తాకట్టు పెట్టేశాడు.
మరోవైపు డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. చివరకు చేసేదేం లేక.. కళ్యాణ్ అప్పులు పెరిగిపోవడంతో అన్నను రుణ విముక్తిడిని చేసేందుకు ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. జై లవకుశ సినిమా కళ్యాణ్‌రామ్‌కు ఫ్రీగా చేసి కళ్యాణ్‌ను అప్పుల నుంచి పూర్తిగా గట్టెక్కించేశాడు.