Moviesబాలయ్య దెబ్బకు నాని డ్రాప్..మళ్లీ ఆ అదృష్టం ఎప్పుడో..?

బాలయ్య దెబ్బకు నాని డ్రాప్..మళ్లీ ఆ అదృష్టం ఎప్పుడో..?

యస్.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాటురల్ స్టార్ నాని..నందమూరి బాలయ్య కోసం వెనక్కి తగ్గిన్నట్లు తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో ‘అఖండ’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్ టాక్ బట్టి చూస్తే డిసెంబర్ 24న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఇప్పటికే రెండు పెద్ద సినిమాలు దిగుతున్నాయి. దీంతో క్రిస్మస్ సీజన్ బెటర్ అని భావిస్తున్నారట.

అయితే ఇక్కడ విషయమేమిటంటే.. అదే సమయానికి నాని తన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. డిసెంబర్ 17న ‘పుష్ప’ ఎలానూ ఉంటుంది. ఒక వారం గ్యాప్ ఇచ్చి నాని తన సినిమాతో రావాలనుకున్నారు. కానీ ఇప్పుడు బాలయ్య పోటీగా వస్తుండడంతో డేట్ మార్చుకోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. ఒక‌వేల అఖండ క్రిస్మ‌స్‌కు ఫిక్స్ అయితే శ్యామ్ సింగ‌రాయ్ 2022కు వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని టాక్ న‌డుస్తోంది.

అఖండ‌తో బాక్సాపీస్ వ‌ద్ద పోటీ ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంలో మేక‌ర్స్ ఉన్నార‌ని తెలుస్తున్నా..దీనిపై అధికారిక ఏదైనా ప్ర‌క‌ట‌న వ‌స్తే స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. కానీ నాని ఆ డేట్ ని మిస్ చేస్తే మళ్లీ సరైన డేట్ ఎప్పుడు దొరుకుంతుందో చెప్పలేం. అలా అని బాలయ్య సినిమాతో పాటు రిలీజ్ చేసి కలెక్షన్స్ షేర్ చేసుకోలేరు. మరి ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news