కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నిన్న తన ఇంట్లో వర్క్ అవుత్స్ చేస్తూ.. జిం లో గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఫ్యామిలీ హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లిన ఫలితం లేకుండాపోయింది. చికిత్స్ తీసుకుంటూనే ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఇకా ఆయన మారణ వార్త కేవలం శాండల్ వుడ్‌ను మాత్రమే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమను సైతం తీవ్ర విషాదంలో నింపేసింది.
చిన్న వయస్సులోనే స్టార్ హీరోగా ఉన్న పునీత్ మృతి అందరికి షాక్ ఇచ్చింది. పునీత్ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగారు పునీత్ రాజ్ కుమార్. చేసింది 29 సినిమాలే అయినా అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్. పునీత్ మరణ వార్త విని కన్నడ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులంతా పునీత్ మరణ వార్త విని షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే కన్నడలో ఇలా స్టార్ హీరోలు సడెన్ గా చనిపోవడం ఇది మొదటైసారి కాదు. గతంలో ఇలాగే ఇద్దరు హీరోల విషయంలో ఇదే జరిగడం గమనార్హం. యస్.. 2009లో కన్నడ మెగాస్టార్ విష్ణువర్ధన్ కూడా 58 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. చనిపోయే సమయానికి ఆయన అగ్ర హీరో. సేం అలాగే 1990లో శంకర్ నాగ్ అనే హీరో కూడా కేవలం 35 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆయన చనిపోయే సమయానికి కన్నడలో స్టార్ హీరో. ఒక సినిమా షూటింగ్లో భాగంగా కార్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. క గత ఏడాది చిరంజీవి సర్జా కూడా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. ఇలా కన్నడ స్టార్ హీరోలు అకాల మృత్యువు ఎన్నో సంవత్సరాలుగా ఆ ఇండస్ట్రీని పట్టిపీడిస్తుంది.