Newsఅసలు ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావడంలేదు.. రోజా ఎమోషనల్..!!

అసలు ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావడంలేదు.. రోజా ఎమోషనల్..!!

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్..నిన్న జిం లో వర్క్ అవుట్స్ చేస్తూ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో కన్నడ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా సడేన్ గా గుండెపోటు రావడంతో పునీత్ కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండాపోయింది. చికిత్సనందిస్తుండగా పునీత్ తుదిశ్వాస విడిచారు.

పునీత్ మరణం పై సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సినీనటి, నగిరి ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. పునీత్ చాలా మంది వ్యక్తి. వాళ్ళ నాన్న ఎంత పెద్ద హీరో అయినా చాలా సింపుల్ గా ఉంటాడని..పునీత్ రాజ్ కుమార్ మరణవార్త విని చాలా బాధేసిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆయనకు నేను తల్లిగా ఓ సినిమాలో నటించానని చెప్పిన రోజా. ..వర్కౌట్స్ చేస్తూ పునీత్ చనిపోయారని తెలియగానే ఒక్కసారిగా షాక్ అయ్యానని..అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావడంలేదంటూ కంట తడి పెట్టుకున్నారు. అంతేకాదు పునిత్ మరణ వార్త కేవలం కన్నడ ఇండస్ట్రీనే కాదు సౌత్ మొత్తం బాధపడాల్సిన విషయం ఇది అంటూ రోజా ఎమోషనల్ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news