Moviesకన్నడ స్టార్ హీరో పునీత్ హఠాన్మరణం.."RRR" మేకర్స్ సంచలన నిర్ణయం..!!

కన్నడ స్టార్ హీరో పునీత్ హఠాన్మరణం..”RRR” మేకర్స్ సంచలన నిర్ణయం..!!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాపై రెండు రోజుల క్రితం అక్టోబర్‌ 29న ప్రపంచంలోనే ఇప్పటి వరకు కనివిని ఎరుగనిది చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ఈ మూవీ టీం ట్విట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి గ్లింప్స్‌‌ను విడుదల చేయనున్నారని అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ రోజు మరో అప్‌డేట్‌ ఇచ్చింది ఈ చిత్ర బృందం.

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కారణంగా ఈ రోజు విడుదల చేయాల్సిన గ్లింప్స్‌ను వాయిదా వేశారు ఆర్ ఆర్ ఆర్ మేకర్స్.దీంతో ఆ మూవీ నుంచి వచ్చే సర్‌ప్రైజ్‌ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురు చూస్తు​న్న వాళ్ళు నిరాశ పడుతున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో కన్నడ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.

ఆయన జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా సడేన్ గా గుండెపోటు రావడంతో పునీత్ కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండాపోయింది. చికిత్సనందిస్తుండగా పునీత్ తుదిశ్వాస విడిచారు. పునీత్ మరణం పై సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news