ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఆయన జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఓ హాస్పటల్‌కు తరలించారు. ముందుగా రమణ శ్రీ హాస్పటల్‌కు తరలించిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత బెంగళూరులోని మరో ప్రముఖ హాస్పటల్ విక్రమ్ హాస్పటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించి పోయిందని.. వైద్యులు కూడా తాము ఏం చేయలేమని చేతులు ఎత్తేశారని అంటున్నారు.
పునీత్‌కు చికిత్స అందిస్తోన్న విక్రమ్ హాస్పటల్‌కు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేరుకున్నారు. అక్కడ వైద్య పరిస్థితిని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పునీత్ ఇంటి వద్ద సీనియర్ అధికారులతో హై పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కర్నాటక అంతా హై ఎలెర్ట్ పరిస్థితి నెలకొంది. పునీత్ ఉన్న హాస్పటల్‌కు పలువురు రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ వాళ్లు చేరుకుంటున్నారు.
మరోవైపు బెంగళూరులో ఉన్న పునీత్ అభిమానులు పెద్ద ఎత్తున హాస్పటల్‌కు చేరుకుంటున్నారు. పునీత్ గురించి వైద్యాధికారులు సైతం చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉందని తెలియడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఆందోళన వాతావరణం నెలకొంది. ఇక దివంగత కన్నడ లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ మూడో కుమారుడే పునీత్.
పునీత్‌ను అభిమానులు అప్పు అని ప్రేమగా పిలుచు కుంటారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. 1985లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన పునీత్.. 2002లో అప్పూ సినిమాతో హీరోగా మారాడు.