మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో కూడా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్నారు. ప్రస్తుతం చిరు చేతిలో ఏకంగా నాలుగైదు సినిమాలు ఉన్నాయి. చిరు, రామ్‌చరణ్ కాంబోలో వస్తోన్న ఆచార్య కూడా వచ్చే యేడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత వరుస పెట్టి క్రేజీ కాంబోలను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు.
ఇక చరణ్ తన తండ్రి చిరంజీవి నటించిన అన్ని సినిమాలు ముందుగా చూస్తాడట. వాటిపై తన అభిప్రాయన్ని కూడా షేర్ చేసుకుంటాడట. ఇక చిరు నటించిన అన్ని సినిమాల్లో కొన్ని తనకు బాగా నచ్చుతాయని చరణ్ చెపుతాడు. ఇంద్ర – ఠాగూర్ – ఖైదీ లాంటి సినిమాలు తనకు ఎంతో నచ్చుతాయని చెర్రీ చెప్పాడు. ఇక చిరు బ్లాక్‌బస్టర్ హిట్ గ్యాంగ్ లీడర్ సినిమా సైతం చరణ్‌కు ఎంతో ఇష్టం. అలాగే విజేత సినిమా చాలా బాగా నచ్చిందని ఎన్నోసార్లు చెప్పాడు.
ఇక చిరు నటించిన సినిమాల్లో ఏదీ నచ్చలేదు అని చాలా సార్లు చరణ్‌ను ఎంతో మంది ప్రశ్నించారు. అయితే అన్ని సినిమాల నుంచి తానే ఏదో ఒక పాఠం నేర్చుకున్నానని చరణ్ చెప్పేవాడు. అయితే బిగ్‌బాస్ సినిమా మాత్రం తనకు ఎలాంటి పాఠం నేర్పలేదని చెప్పాడు. ప్రతి సినిమాలో ఏదో పాఠం ఉందని.. బిగ్‌బాస్ నుంచి మాత్రం తాను ఏం నేర్చుకోలేకపోయానని అనడంతో పాటు పరోక్షంగా ఆ సినిమా నచ్చలేదని చెప్పాడు.
బిగ్‌బాస్‌కు విజయ బాపినీడు డైరెక్టర్. గ్యాంగ్‌లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. రోజా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.