ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ కూడా కాస్టింగ్ కౌచ్ టార్చర్ అనుభవిస్తోందట. ఆమె వర్థమాన నటి.. స్టార్ హీరోయిన్ అవుదామన్న కలలతో ఇండస్ట్రీకి వచ్చింది. మన తెలుగు బ్యాక్‌గ్రౌండ్. మంచి నటన కూడా ఆమె సొంతం.. చూడడానికి కావాల్సినంత అందం.
ఓ చిన్న సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ సినిమా డిజాస్టర్. అయితే ఆ సినిమాలో ఎవ్వరికి రానంత పేరు ఆమెకే వచ్చింది. ఆమె లుక్స్‌కు యూత్ ఫిదా అయిపోయారు. ఆ సినిమా ప్రమోషన్లలో హీరో కంటే ఆమె గురించే చర్చ జరిగింది. ఆ పాపులారిటీతోనే వెంటనే రెండో సినిమాలో ఛాన్స్ వచ్చింది. కాస్త క్రేజ్ ఉన్న హీరో. అయితే ఈ సినిమాతో పాటు ఆమెకు ఆ తర్వాత వరుసగా వచ్చిన అన్ని ఛాన్స్లలోనూ ముందుగా కమిట్మెంట్ ఇవ్వాలని ఓపెన్‌గానే అడిగేస్తున్నారట.
ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కాస్త కోపరేట్ చేయాల్సిందే అని నిర్మొహమాటంగా ఆమెకు చెపుతున్నారట. ఇవన్నీ ఆమెకు తెలియనివి కావు.. అయితే మరీ ప్రతి సినిమాకు ఇంత ఓపెన్‌గానే కమిట్మెంట్లు అడిగేస్తుండడంతో ఈ విషయం ఆమె తన ఫ్రెండ్స్‌తో చెప్పుకుని బాధపడిందట. మరీ ఇంత రొచ్చు రొచ్చుగా ఉంటుందని తాను అనుకోలేదని ఆమె వాపోతోందట.