యువరత్న నందమూరి బాలకృష్ణ – క్రేజీ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ రచ్చ ఎలా ఉండేదో అప్పటి ప్రేక్షకులకు బాగా తెలుసు. వీరిద్దరి కాంబినేషన్లో ఐదు సినిమాలు వచ్చాయి. అందులో నాలుగు సినిమాలు సూపర్ హిట్లు. అందులో మూడు ఇండస్ట్రీ హిట్లు. లారీ డ్రైవర్ ఓ మోస్తరు హిట్. రౌడీ ఇన్‌స్పెక్టర్ బ్లాక్‌బస్టర్. ఇక సమరసింహా రెడ్డి, నరసింహానాయుడు సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో సుమోలు గాల్లోకి లేవడం… ట్రైన్ సీన్లు ప్రేక్షకులకు ఇప్పటకీ మర్చిపోలేని థ్రిల్ ఇస్తాయి. ఇందుకు ప్రధాన కారణం స్క్రిఫ్డ్ డిమాండ్ చేయడంతో పాటు సమరసింహారెడ్డి స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ అని గోపాల్ చెప్పారు. సమరసింహా రెడ్డి సినిమాలో సుమోలు లేపినట్టు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇక నరసింహానాయుడు సినిమాలో ట్రైన్లో వెళుతుంటే సుమోలు చేజ్ చేయడం, హీరో అన్నయ్యలను ట్రైన్ ఎక్కించే క్రమంలో హీరోపై గొడ్డలి విసిరే సీన్లకు చాలా మంది ఫోన్లు చేసి రొమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్పేవారట. ఏదేమైనా సమరసింహారెడ్డిలో సుమోలు లెగడానికి, నరసింహానాయుడు సినిమాలో జీపులు లేవడానికి అక్కడ విజయేంద్రప్రసాద్, ఇక్కడ చిన్ని కృష్ణ కారణమని గోపాల్ చెప్పారు.