భారత దేశ సినిమా చరిత్రలో సినిమా తారలకు క్రికెటర్లకు ఉన్న లింకులు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1970వ దశకం నుంచే సినిమా వాళ్లకు , క్రికెటర్లకు ప్రేమలు , పెళ్లిళ్లు పెటాకులు ఉన్నాయి. అయితే ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి తో మొదలు పెడితే ప్రస్తుత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వరకు ఎంతో మంది సినిమా అమ్మాయిలను ప్రేమలో పడేశారు. రవిశాస్త్రి అప్పట్లో ఓ స్టార్ ఆల్‌రౌండర్. అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమృతా సింగ్‌తో మనోడు ప్రేమలో పడడంతో పాటు డేటింగ్ కూడా చేశాడు.
వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. నిశ్చితార్థం వరకు వెళుతోందనుకుంటోన్న టైంలో బ్రేకప్ అయ్యింది. ఇక అమృతా సింగ్ అంతకు ముందే బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్తో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడికి పెళ్లియిన విషయం తెలిసి మోసపోయానని భావించి అతడికి దూరమైంది. ఆ తర్వాత రవిశాస్త్రి పరిచయంతో అతడే లేకంగా గడిపింది. వీరి సాన్నిహిత్యం గురించి అప్పట్లో బాలీవుడ్ మీడియాతో పాటు న్యూయార్క్ మీడియా సైతం ప్రముఖంగా వార్తలు రాశారు. ఆ తర్వాత న్యూయార్క్‌లోని ఓ హోటల్లో వీరు ఉంగరాలు మార్చుకున్నారట.
అదే టైంలో అమృతా సింగ్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్. పెళ్లయ్యాక సినిమాలు మానేయాలని రవిశాస్త్రి కండీషన్. అందుకు అమృత ఒప్పుకోలేదు. ఆ తరువాత విడిపోయారు. అనంతరం అమృత సైఫ్ ఆలీఖాన్‌ను 1991లో పెళ్లాడితే, రవిశాస్త్రి 1990 లో రీతూ వర్మను పెళ్లాడారు. అయితే ఆ తర్వాత కూడా వీరి పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. రవిశాస్త్రి – రీతూసింగ్కు 22 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చేశాడు. అమృత సైఫ్‌కు 2004లో విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత సైఫ్ కరీనా కపూర్‌ను పెళ్లాడాడు. అయితే ఇప్పుడు రవిశాస్త్రి నిమ్రత కౌర్ తో ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.