Moviesపగిలిపోద్ది రేయ్..నీకేంట్రా అంత నొప్పి..అరియానా స్ట్రైట్ వార్నింగ్..!!

పగిలిపోద్ది రేయ్..నీకేంట్రా అంత నొప్పి..అరియానా స్ట్రైట్ వార్నింగ్..!!

బిగ్ బాస్ షో పుణ్యమా అని ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సైతం అందుకున్నారు. దీంతో వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ హవాను చూపిస్తున్నారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోతున్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీ ఒకరు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఫినాలేలో అడుగు పెట్టిన ఈ భామ.. షో తర్వాత హల్‌చల్ చేస్తోంది. సినిమాలు, షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

అరియానా… బిగ్ బాస్ 4 హౌస్‌లోకి బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి అల్లాడించింది. టైటిల్ సాధించిలేకపోయినప్పటికీ.. ఆడపులిలా సింగిల్‌గానే ఆట ఆడింది. బిగ్ బాస్ షో వల్ల క్రేజ్ దక్కించుకున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది అరియానా అని చెప్పొచ్చు. బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో ఈ అమ్మడు క్రేజ్ ఓ రేంజ్‍లో దూసుకుపోయింది. బిగ్ బాస్ ఇంట్లో తన ఆట తీరుకు, మాటలకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియానా. రామ్ గోపాల్ వర్మను చేసిన ఒక్క ఇంటర్వ్యూతో అరియానా ఫేమస్ అయ్యింది. యాంకర్‏గా కెరీర్ ఆరంభించిన అరియానా.. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది.

అయితే అమ్మడు తాజాగా సోషల్ మీడియా ద్వారా టార్చర్ చేస్తున్న ఓ వ్యక్తి పై నోటికివచ్చిన్నత్లు తిట్టేసింది. మాస్ మాటలతో నీకేంట్రా నొప్పి ? అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అరియనా ఫోటోలను మర్ఫింగ్ చేసి పెడుతున్నాడట. ఎన్నిసార్లు ఆ పేజ్ ను బ్లాక్ చేసినా మళ్ళీ మళ్ళీ కొత్త పేజ్ ఓపెన్ చేసి మెంటల్ టార్చర్ చేస్తున్నాడట.ఇక సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన అరియానా అతగాడికి సోషల్ మీడియా వేదికగానే బుద్ది వచ్చేలా చేసింది. “నీకేంట్రా నొప్పి ? ఎందుకంత పగ? నువ్వు ఎవడో నాకు తెలియాలి పగిలిపోద్ది నీకు.” అంటూ ఫైర్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news