సౌత్ లో క్రేజీ హీరోయిన్స్ లో ఒకరైన అమలా పాల్ తమిళ దర్శకుడి విజయ్ ని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత అంతా బాగానే ఉన్న కూడా..వీరిద్దరి మధ్య గొడవలు మొదలై.. దూరంగా ఉంటూ ఆ ఇక కలిసి ఉండలేక విడిపోయారు. భర్త తో విడిపోయాక కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన అమల.. మళ్లీ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే అమలాపాల్. అవకాశాలు అంతగా లేని సమయంలోనే పెళ్లి పీటలు ఎక్కేసింది. తీరా పెళ్లి చేసుకున్నాక మంచి మంచి అవకాశాలు రావడంతో ఆ పెళ్లి తంతును కూడా అంతే స్పీడ్ గా కట్ చేసేసుకుని తొందరగానే ముగించేసింది.
భర్తతో విడాకులు తీసుకున్న విషయాన్ని స్వయంగా తానే వెల్లడించేసి షాక్ ఇచ్చేసింది. అంతేనా మగాళ్లు మాత్రమే విడాకులు తీసుకోవాలా? మేమేం తక్కువ తిన్నామా అన్నట్లు సంచలనాలు సృష్టించేసింది. పెళ్లయ్యాక కూడా సినిమాలు చేసిన ఈ సుందరి హోమ్లీగానే కనిపిస్తూ వచ్చింది. కానీ విడాకులు అయిపోయాక మాత్రం తానేంటో చూపించేసింది. అంటే గ్లామర్ డోస్ పెంచేసింది అన్నమాట. తన అందాల ఆరబోత ద్వారా మళ్ళీ కెరియర్ ని గాడిలో పెట్టాలని చూస్తోంది. అందుకే ఫొటో షూట్లు చేసినా సినిమాల్లో అయినా హాట్ హాట్ గా కనిపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో అమలాపాల్ బోల్డ్ హీరోయిన్ గా మారిపోయింది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ ముద్దుగుమ్మ అక్కినేని అందగాడు నాగరజున తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నాగ్ ఆ సినిమాకు గోస్ట్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీపై అందరిలో భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో [ఫస్ట్ కాజల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె పరసనల్ ప్రబ్లం తో ఈ మూవీ ‘ఘోస్ట్’ నుంచి తప్పుకుంది. దీనితో కాజల్ ప్లేస్ భర్తీ చేసేందుకు బోల్ద్ బ్యూటీ అమలపాల్ వచ్చింది. ఈ సినిమాలో ఓ రోమాంటిక్ పాట ఉంటుందట. ఆ సాంగ్ లో నాగ్-అమల పాల్ ఘటైన్ రొమాన్స్ చేస్తార్ట. ఈ క్రమంలోనే వీళ్ల మధ్య లిప్ లాక్ సీన్స్ కూడా ఉంటాయట. అందుకు అమల కూడా ఒకే చెప్పిందని టాక్. అయితే రెమ్యూనరేషన్ మాత్రం బాగా డిమాండ్ చేస్తుందట. మరి చూడాలి వీళ్ల రొమాన్స్ తెర పై ఎలా పండుతుందో..?