ఎన్నో గొడవలు..మరెన్నో మాటల నడుమ జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు..ప్రత్యర్ధి ప్రకాష్ రాజ్ ప్యాన్ల్ పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే. మా ఎన్నికల్లో మంచు విష్ణు వైసీపీ సపోర్ట్ తో గోల్ మాల్ చేసారని కొన్ని ఫోటోస్ రిలీజ్ చేసారు ప్రకాష్ రాజ్. అయితే మంచు విష్ణు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూపోతున్నట్లు తెలుస్తుంది.
తాజాగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మాలో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు సభ్యులుగా ఉంటారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ముఖ్యంగా మహిళల హక్కుల్ని కాపాడుతూ వారిని గౌరవించడమే ఈ ఉమెన్ ఎంపవర్ మెంట్ గ్రీవెన్స్ సెల్ ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ఇక మా లో మరింతమంది మహిళల్ని భాగస్వాముల్ని చేయడానికి ఈ కమిటీతో కలిసి తొలి అడుగు వేస్తున్నట్లు తెలిపారు. ‘మా’లో సభ్యత్వం తీసుకునేందుకు మరింత మంది మహిళా కళాకారులు ముందుకు రావాలని మంచు విష్ణు పిలుపునిచ్చారు. నటీమణులకు మరింత శక్తిని అందించడంలో ‘మా’ తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
#MAA growing stronger and more accountable! More Power to Women 💪🏽 pic.twitter.com/OSkAQSEUJF
— Vishnu Manchu (@iVishnuManchu) October 22, 2021