ఎలాంటి దర్శకుడైనా ఒక్క ఫ్లాప్ ఇస్తే చాలు.. అతడి ముందు విజయాలన్నీ మరిచిపోయే ఇండస్ట్రీ ఇది. అది వాళ్ల తప్పు కాదు.. ఇండస్ట్రీ పోకడ అంతే మరి. ఇక్కడ విజయాలకే కానీ పరాజయాలకు చోటుండదు. అందుకే అగ్ర దర్శకులకు కూడా అప్పుడప్పుడూ ఈ తిప్పలు తప్పవు. మురుగదాస్‌కు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. గత కొన్నేళ్లుగా ఈయన నుంచి స్థాయికి తగ్గ సినిమాలు రావడం లేదనే కంప్లైంట్ ఉంది. వరుస ఫ్లాప్ పడడంతో మురుగదాస్ రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ టైంలో విజయ్ ఆయనకు దేవుడిలా కనిపించారు.
మురుగదాస్ కథలన్నీ విభిన్నంగా ఉంటాయి. షార్ట్ టర్మ్ మొమొరీ లాస్ అనే కథాంశంతో ‘గజిని’ తీర్చిదిద్దారు. ‘రమణ’, ‘సెవెన్త్‌సెన్స్’, ‘తుపాకీ’ కూడా సాధారణ సినిమాలకు విభిన్నంగా సాగేవే. అందుకే మురుగదాస్ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి. ఇక విజయ్ తో తీసిన ‘కత్తి’ అనే సినిమా అందరి ఆకట్తుకుంది. ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్ అదుర్స్ అనే చెప్పాలి. ఈ సినిమాలో విజయ్ జంటగా అందాల తార సమంత నటించింది. ఇక ఈ సినిమాను కె.కరుణామూర్తి, ఎ.శుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఈ సినిమాకు మైన్ ప్లస్ అనిరుథ్ స్వరాలు అందించారు.
అయితే నిజానికి ఈ సినిమాను ఫస్ట్ టాలీవుడ్ బడా హీరో తో చేయాలని భావించారట. కానీ లాస్ట్ కి విజయ్ తో చేయాల్సి వచ్చింది. ముందుగా ఈ కథను దర్శకుడు మురుగదాస్.. మెగాస్టార్ చిరంజీవికి చెప్పారు. కానీ కథ నచ్చినా కూడా అప్పటికీ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో చిరు.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. అలా ఈ కథ విజయ్ చేతికి వెళ్లింది. కానీ విశేషం ఏంటంటే మళ్లీ ఆ సినిమాతోనే చాలాకాలం గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.సోషల్ మెసేజ్‌తో తెరకెక్కిన విజయ్ ‘కత్తి’ని ఖైదీ నెం.150గా రీమేక్ చేశారు చిరంజీవి.