సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్ నయనతార, కోలీవుడ్ యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎప్పటి నుంచో ప్రేమాయణంలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. విఘ్నేష్ దర్శకత్వం వహించిన సినిమాలో నయనతార నటించింది. అప్పటి నుంచి వీరి మధ్య మొదలైన స్నేహం.. విఘ్నేష్ తీరు ఆమెను ఆకట్టుకోవడంతో చివరకు నయన్ అతడి ప్రేమకు లొంగిపోయింది. అంతకు ముందే హీరోలు శింబు, ప్రభుదేవాతో నయనతార ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్లి వెనక్కు వచ్చేశాయి. అయితే విఘ్నేష్ శివన్ తో కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న తాజాగే నిశ్చితార్ధం చేసుకున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.
త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. పెళ్లికి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే వీరి పెళ్లికి ఇరువురికి చెందిన కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సినీ పరిశ్రమకు చెందిన సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందినట్టు సమాచారం. మరికొద్ది రోజులలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయిన ఈ జంట కు పండితులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇద్దరు జాతకాలను చూపించుకోగా, నయనతార దోషం పోయేందుకు ఒక చెట్టును పెళ్లాడబోతున్న ట్లు తెలుస్తోంది. ఈ తంతు పూర్తిచేసిన తర్వాత మూడు నాలుగు నెలల్లోనే నయన్ వివాహం జరుగుతుందని సమాచారం.
గతంలో కూడా బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకునే ముందు కూడా ఇలాగే చేశారు. ఐశ్వర్యారాయ్ జననం కూడా దోషాలతో కూడుకున్నది కావడంతో ఆమె ఏకంగా మూడు చెట్లను వివాహం చేసుకుంది. అభిషేక్ తో కాపురం సజావుగా సాగాలంటే ఇలాంటి ఆచారం తప్పదని జ్యోతిష్యులు సూచించడంతోనే ఐష్ సనాతన సంప్రదాయ పద్దతులను అనుసరించారు.2022వ సంవత్సరం ప్రథమార్థంలో వీరి పెళ్లి జరగడం ఖాయం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరగడంతో ఇక పెళ్లి బాజాలు మోగడమే ఆలస్యం అంటున్నారు సన్నిహితులు.