జబర్దస్త్ షో ద్వారా చాలా తక్కువ టైంలోనే మంచి పాపులార్ అయ్యాడు అవినాష్. ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాడు. అప్పటి వరకు బిగ్‌బాస్ హౌస్‌లో లేని ఎట్రాక్షన్ అవినాష్ ఎంట్రీతో వచ్చింది. అవినాష్ చేస్తోన్న కామెడీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అవినాష్ వచ్చాకే బిగ్‌బాస్ రేటింగ్‌లు కాస్త పుంజుకున్నాయనే చెప్పాలి. అక్కడ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా మరో లేడీ కంటెస్టెంట్, యాంకర్ అరియానాతో స్నేహం, లవ్ అంటూ వార్తల్లో నిలిచాడు.
సీన్ కట్ చేస్తే నాకు కాబోయే భార్య ఈమె అంటూ ఓ పోస్ట్ పెట్టి అందరికి మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చారు. ఇటీవల అవినాష్ నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అవినాష్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే ఆయన పెళ్లి పనులు మొదలైయాయి. తాజాగా అవినాష్ స్వస్థలంలోనే హల్దీ వేడుక జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు టీవీ నటులు సహా నెటిజన్ల నుంచి అవినాష్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అవినాష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అనూజ. ఈ విషయాన్ని అవినాష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఎంగెజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎక్కువ రోజులు వెయిట్ చేసిన తర్వాత సరైన వ్యక్తి మీ జీవితంలో వచ్చేస్తారు. మా కుటుంబాలతో పాటు మేము కలిసాం..అంటూ పోస్ట్ పెట్టారు.