Moviesఅసలు “బొమ్మరిల్లు” సినిమా ఎక్కడ నుంచి కాపీ కొట్టారో తెలుసా..?

అసలు “బొమ్మరిల్లు” సినిమా ఎక్కడ నుంచి కాపీ కొట్టారో తెలుసా..?

“బొమ్మ‌రిల్లు”..ఈ సినిమా టాలీవుడ్ లో ఎన్ని రికార్డులను తిరగరాసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో హీరో,హీరోయిన్ లు గా సిధార్డ్,జెనిలియా నటించారు. ఇక సిద్దార్థ్‌ కెరీర్ లో ది బెస్ట్ మూవీ.. ఎవర్ గ్రీన్ మూవి ఉంది అంటే అది “బొమ్మరిల్లు” అనే చెప్పాలి. టాలీవుడ్‌లో బొమ్మరిల్లు సినిమాకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బొమ్మరిల్లు.. నాన్న ప్రేమ ను చక్కగా చూపించిన సినిమా ఇది. ఈ సినిమాతో దర్శకుడు భాస్కర్ పేరు బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది.

ఈ సినిమా తోనే మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగు పెట్టాడు బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు సినిమాలోని ప్రతీ పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఈ సినిమాలో జెనీలియా నటన హైలెట్ అని చెప్పవచ్చు. హ..హా హాసిని అంటూ చాలా క్యూట్ గా నటించింది. ఇక 2006 ఆగస్ట్ 9న విడుదలైన ఈ మూవీ టాలీవుడ్‌లో ఓ హిస్టరీని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో ప్రతి సీన్ హైలైట్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగ్స్..పాటలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి.

అయితే.. ఈ సినిమాకు కథను ఓ పుస్తకం నుంచి తీసుకున్నారని..అప్పట్లో హాట్ టాపిక్ గా వార్తలు వినిపించాయి. ‘ఆమెలో ఏముంది’ అనే బుక్ నుంచి ఈ కథను తీసుకున్నారట. షాకింగ్ ఏమిటంటే ఆ బుక్ రచయిత కూడా దర్శకుడిపై అప్పట్లో కేసు వేసినట్లు రూమర్స్ తెగ హల్ చల్ చేసాయి. కొన్ని రోజులు హాట్ హాట్ గా నడిచిన డిస్కషన్స్..ఆ తరువాత చల్లారిపోయాయి. కొన్ని రోజుల తరువాత ఈ విషయం గురించి ఎవరు పట్టించుకోనేలేదు. అయితే బోమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలయ్యాక.. మళ్ళీ ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. దీని పై నెట్టింట్లో హాట్ చర్చ కొనసాగుతుంది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news