గత కొద్దిరోజులుగా చిత్రపరిశ్రమలోని ప్రముఖుల చుట్టూ వివిధ కేసులు తిరుగుతున్నాయి. డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులతో సెలబ్రెటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారిస్తోంది. ఇటు తెలుగు ఇండస్ట్రీలోని పలువురు తారలను సెప్టెంబర్ నెలలో డ్రగ్స్ కేసులో భాగంగా విచారించిన ఈడీ.. అటు బాలీవుడ్లో సైతం మనీలాండరింగ్ కేసులో భాగంగా తారలను విచారించే పనిలో పడింది.
బాలీవుడ్ నటి నోరా ఫతేతోపాటు జాక్వెలిన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. 2 వందల కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో నోరా ఫతేకు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.గతంలోనూ ఇదే కేసులో మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. మానీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను దాదాపు ఐదు గంటలుగా విచారించారు.
ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రమోటర్ శివేందర్ సింగ్ కుటుంబాన్ని రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో నటి నోరా ఫతేహికి ఈ సమన్లు జారీ అయ్యాయి. సుకేశ్ చంద్రశేఖర్, లీనా పాల్‌లపై నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ సమన్లు పంపించిన్నట్లు తెలుస్తుంది. చాలా మందిలాగే సుఖేష్ కూడా నోరా ఫతేహిని చిక్కుల్లో పడేయడానికి ఈ పథకం వేశాడని అంటున్నారు.