దాదాపు మూడు నాలుగు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల హడావిడికి ఆదివారం తెరపడింది . తెలుగు చిత్రసీమకు సంబంధించి మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారు. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘనవిజయం సాధించారు.
ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..ప్రకాష్ రాజ్ ప్యానల్ ను .. విష్ణు ప్యానల్ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. ఈ భారీ విజయంతో మంచు ఫ్యామిలీ మద్దుతుదారులు మోహన్ బాబు జిందాబాద్, విష్ణు బాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక మంచు విష్ణు గెలుపు పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేసారు. అయితే మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
తెలుగు చిత్రసీమకు సంబంధించి మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..’మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, మిగతా విజేతలందరికీ పేరు పేరునా నా అభినందనలు. మనకు పదవులు శాశ్వతం కాదని, అవి కేవలం తాత్కాలికమైనవని, మనం ఇలా చిన్న చిన్న పదవుల కోసం ఒకరినొకరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం మంచి పద్ధతి కాదని అంటూ.. అందరూ సినీ ఇండస్ట్రీ అభివృద్దికి కృషి చేయాలన్నారు. ‘మా’ ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను’ అని ..ఇంత చిన్న ఎన్నికలకు ఇంత హైప్ అవసరం లేదన్నారు. ఇందుకు గాను మనలో మనం గొడవపడడం బాగాలేదన్నారు. అందరూ కలసి కట్టుగా ఉండాలన్నారు.
Hearty Congratulations to the new President of MAA @iVishnuManchu Exec.Vice President @actorsrikanth & each and every winner of the New Body of our MAA family# #movieartistsassociation pic.twitter.com/Nguq0sf5hp
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 10, 2021