తెలుగు చిత్రసీమకు సంబంధించి మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విష్ణు విజయం సాధించారు. ఇకాడ షాకింగ్ ఏమిటంటే..ప్రకాష్ రాజ్ ప్యానల్ ను .. విష్ణు ప్యానల్ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. ఇక మంచు విష్ణు గెలుపు పట్ల పలువురు సినీ సెలబృఇటీలు ఆనందం వ్యక్తం చేసారు.
అయితే మెగా బ్రదర్ నాగ బాబు మాత్రం ఏవ్రు ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది ఏమితంటే ఆయన మా ప్రాథమిక రాజీనామా చేసారు. మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు అని తెలిసిన కొద్ది సేప్పటికే ఆయన ఇలా మా ప్రాధమిక సభ్యత్వానికి రాజినామ చేయడం సంచలనంగా మారింది.ఇక తాజాగా జరిగిన మా ఎన్నికల్లో నాగబాబు ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌కి సపోర్ట్ చేసిన విషయం అందరికితెలిసిందే.
తాజాగా వెలువడిన ఫలితాల్లో ప్రకాష్ రాజ్ పరాజయం చెందారు. మొదట్నుంచీ ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్‌గా ఉన్న నాగబాబు మంచు విష్ణు విజయాన్ని జీర్ణించుకోలేపోతున్నారు అంటూ సిని ఇండస్ట్రీలో గుస్గుసలు వినిపిస్తున్నాయి. అందుకే కాబోలు ఆయన మా సభ్యత్వానికి రాజీనామా చేసారంటూ చేచించుకుంటున్నారు. ఇక ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టు మిట్టాడుతున్న అసోసియేషన్‌లో ఇకపై కొనసాగలేనని, ఇక సెలవు.. అని ..తన రాజీనామాను 48 గంటల్లో మా అసోసియేషన్‌కు పంపిస్తానని నాగబాబు తెలిపారు.
ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో
కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో
కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్‌లో “నా”
ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను…
సెలవు.
– నాగబాబు, pic.twitter.com/wLqwOKsNtq— Naga Babu Konidela (@NagaBabuOffl) October 10, 2021