సినిమాలు రంగంలో ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకోవడం… ఆ తర్వాత విడాకులు తీసుకోవడం కామన్. తెలుగులోనే తాజాగా అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు. ఇది రెండు, మూడు రోజులు పెద్ద న్యూస్‌గా ఉన్నా.. తర్వాత దీని గురించి అందరూ మర్చిపోవడం కామన్. ఇదిలా ఉంటే సమంత విడాకులు ఇచ్చాక సిద్ధార్థ్ పేరు కూడా చర్చకు వచ్చింది. గతంలో సమంత – సిద్ధు ప్రేమించుకున్నారని.. వారు పెళ్లి చేసుకుంటారనగా వారి మధ్య బ్రేకప్ జరిగిందని అంటారు.
అయితే ఇందులో సిద్ధూయే సమంతను వాడుకుని మోసం చేశాడని.. అందుకే ఆమె చైతుకు దగ్గరైందని అంటారు. అయితే సిద్ధార్థ్ ఇండస్ట్రీకి రావడానికి ముందే మేఘన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాలా చిన్న వయస్సులోనే సిద్ధుకు పెళ్లయ్యింది.. ఒక బాబు కూడా ఉన్నాడు. తెలుగులో బాయ్స్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న మనోడు సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.
2003లో మేఘనను పెళ్లి చేసుకున్నాక.. ఒక బాబు పుట్టాక వరుస హిట్లతో మనోడికి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత నాలుగేళ్లకే 2007లో మేఘనకు విడాకులు ఇచ్చాడు. అయితే ఈ మేఘన ఎవ్వరు అన్నది ఎప్పుడూ బయటకు రాలేదు. ఆమెతో విడాకులు తీసుకున్న విషయంపై కూడా సిద్ధూ ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు. మేఘనతో విడిపోయిన తరువాత తనతో నటించిన పలువురు హీరోయిన్లతో సిద్ధార్థ్ ప్రేమాయణాలు కొనసాగిస్తూనే వచ్చాడు. అందుకే అతడి కెరీర్ స్పాయిల్ అయ్యిందని అంటారు.
సమంత, శృతీహాసన్లను సిద్ధార్థ్ ఫుల్లుగా వాడుకున్నాడని టాక్ ఉంది. ఇక బాలీవుడ్ హీరోయిన్ సోహా ఆలీఖాన్‌తో కూడా ప్రేమాయణం నడిపాడు. వీరిద్దరు కూడా విడిపోయారు. సోహా కొన్ని సార్లు సిద్ధార్థ్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు కూడా చేసింది. ఇక ఇప్పుడు కూడా అతడు కోలీవుడ్‌లో తనతో నటిస్తోన్న దీప సన్నీతో డేటింగ్ చేస్తున్నట్టు టాక్ ?