సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫైర్లు, డేటింగ్లు చాలా కామన్. ఎంత గొప్ప జంట అయినా.. ఎంత గొప్పగా ప్రేమించుకున్నా వారు ఎప్పటి వరకు కలిసి ఉంటారో చెప్పలేం. ఇక ఏ జంట అయినా రెండు, మూడు సినిమాల్లో కలిసి నటిస్తే చాలు.. వారి మధ్య ఏదో ఉందని అనుమానాలు రావడం కూడా కామన్. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగు మహిళా ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉన్న జగపతిబాబుపై కూడా అనేక రూమర్లు వినిపించాయి.
సీనియర్ దర్శక, నిర్మాత వీబీ. రాజేంద్ర ప్రసాద్ తనయుడు అయిన జగపతిబాబు 1990వ దశకంలో మహిళా ప్రేక్షకుల మనసు దోచిన హీరో. అప్పట్లో జగపతిబాబు ఓ టీవీ నటితో ఎఫైర్ పెట్టుకున్నాడన్న వార్తలు వ్యాపించాయి. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలు ఎక్కువుగా బయటకు రావడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు బాగా షికారు చేశాయి. బుల్లితెరపై అప్పట్లో బాగా పాపులర్ అయిన ఈ నటికి జగపతిబాబుతో ఎఫైర్ ఉందన్న వార్తలు రావడంతో ఆమె బుల్లితెరకే దూరమైన పరిస్థితి.
ఆ మాటకు వస్తే ఈ టీవీ నటితో మాత్రమే కాదు.. కనీసం అప్పట్లో టాప్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారందరితోనూ జగపతిబాబు చాలా క్లోజ్‌గా ఉంటాడన్న వార్తలు బాగా హల్ చల్ చేశాయి. ఇక లెజెండ్‌తో సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు విలన్‌గా దూసుకు పోతున్నాడు.