తెల్లారితే చాలు ఫేస్ బుక్ లో జీవితాలు గడిపేసే మహానుభావులు ఎందరో ఉంటారు. ఫేస్ బుక్ లో ఎన్ని సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయో కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చాట్టింగ్ లూ మీటింగ్ లూ చేస్తూ ఉంటారువేరు. అలా తెలియని ఒక అమ్మాయి తో మాట్లాడి ఇరుక్కున్నాడు ఒకడు. పాత గుంటూరుకు చెందిన ఎల్‌ఎల్‌బీ చదువుతున్న యువకుడు ఫేస్ బుక్ లో యువతికి ఫ్రెండ్ రిక్వెస్టు పంపాడు. అనంతరం వారి మధ్య పరిచయం పెరిగింది. ఈ క్రమంలో వారిద్దరూ కలుసుకోవాలనుకున్నారు. దీంతో ఆ యువతి అతనిని జేకేసీ కళాశాల రోడ్డులోని ఖాళీ స్థలం దగ్గరకి రమ్మంది.
దీంతో అతను అక్కడికి చేరుకున్నాడు. అతనిని కలిసే సమయంలో ఆమె తన ముఖానికి స్కార్ఫ్ కట్టుకుంది. దీంతో ఎవరైనా చూస్తారని అలా స్కార్ఫ్ కట్టుకుందని భావించిన యువకుడు దానిని తీయమని బలవంతం చేయలేదు. దీంతో అతనితో కాసేపు మాట్లాడిన యువతి అతని చేతిలో ఉన్న ఖరీదైన ఫోన్ ను అడిగి తీసుకుంది. అతను ఆదమరపుగా ఉండగా, ఆ ఫోన్ తీసుకుని తన స్కూటీపై ఉడాయించింది.