పవన్ కళ్యాణ్.. రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ పోతున్నారు. టాలీవుడ్ లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఒక సినిమా పూర్తి కాకముందే మరొక సినిమా కు సైన్ చేస్తూ..కెరీర్ ను బిజీ బిజీ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినీ జోరు చూస్తుంటే..రానున్న రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ కు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఇక ఆ సినిమా తరువాత పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఆ తరువాత గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇవే కాకుండా పలువురు బడా డైరెక్టర్స్ ని లైన్లో పెట్టున్నారు పవన్.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..పవన్ కళ్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ని లైన్లో పెట్టిన్నట్లు తెలుస్తుంది. రీసెంట్గా సాయి ధరమ్ తేజ్‌తో ‘రిపబ్లిక్’ సినిమా రూపొందించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు దేవా కట్టాతో పవన్ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. రిపబ్లిక్ సినిమా తర్వాత దేవా కట్టా దర్శకత్వం పవన్‌కు నచ్చడంతో.. తన కోసం ఓ కథ రావాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఆనందంతో దేవా కట్టా అంగీకరించారు అని సమాచారం. ఇక మేనల్లుడుకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ తో పవన్ జోడీ కడితే బొమ్మ దద్దరిల్లాల్సిందే అంటున్నారు అభిమానులు.