మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్కంఠ పెరుగుతుంది. అధ్యక్ష పదవి కోసం హీరో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ ఇద్దరు తమ ప్యానల్స్‌తో ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (maa) ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్యానల్ మెంబర్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఫైర్ అవుతుండటం చూస్తున్నాం.
నామినేషన్స్ తర్వాత ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరే అధ్యక్ష బరిలో ఉండటం, వారి మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారడంతో సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే ఇష్యూపై చర్చలు నడుస్తున్నాయి. ఎలక్షన్ డేట్ అక్టోబర్ 10 దగ్గరకు రావడంతో.. అభ్యర్థులు ఈ తరహా ప్రచారాలకే ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తూ… ‘మా’ మెంబర్స్ ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో మంచు విష్ణు ప్యానెల్ విజయం మేనిఫెస్టోను ప్రకటించింది. తమ ప్యానెల్ విజయం సాధిస్తే రెండు తెలుగు ప్రభుత్వాలతో మాట్లాడిన అర్హులైన ఆర్టిస్ట్‌లకు సొంత ఇల్లు వచ్చేలా చేస్తామన్నారు.
ఇంకా ఆ మేనిఫెస్టోలో ఏముందంటే.. అర్హులైన సభ్యులకు సొంత ఇళ్లు ఇస్తామని..మా సభ్యుల పిల్లల విద్యకు ఆర్థిక చేయూత ఇస్తామన్నారు. మాలో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘మా యాప్’ ద్వారా సభ్యుల పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసి, నిర్మాతలు, దర్శకులు, రచయితలకు అందిస్తామన్నారు. ప్రతీ ఒక్కరికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, హెల్త్‌కార్డులు , పిల్లలకు కేజీ టు పీజీ వరకు విద్యాసాయం అందిస్తామన్నారు. మహిళల రక్షణకి హై పవర్ కమిటీ..కల్యాణలక్ష్మీ తరహాలో రూ.1.16 లక్షలు..అర్హులైన సభ్యులకు పెన్షన్లు ఇస్తామన్నారు.‘మా’సభ్యత్వ ఫీజు రూ.75 వేలకు తగ్గింపు కూడా చేస్తామన్నారు