అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా గత నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫీల్ గుడ్ చిత్రాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే మంచి బజ్ వచ్చింది. అందుకే కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఏ సినిమాకు రాని విధంగా లవ్ స్టోరీకి అడ్వాన్స్ బుకింగ్‌లు అయ్యాయి.
ఏషియన్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను రు. 31 కోట్లకు అమ్మారు. అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనాలు థియేటర్లకు వస్తారా ? రారా ? అన్న సందేహాలు ఓ వైపు ఉండగానే.. అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ ఇప్పటికే రు. 32 కోట్ల షేర్ రాబట్టింది. 12 రోజులకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావడంతో ట్రేడ్ వర్గాల్లో తర్వాత సినిమాలు కొనేందుకు కాస్త ధైర్యం వచ్చింది.
లవ్ స్టోరీ జోరు ఇంకా కొనసాగుతుండడంతో ఈ సినిమా భారీ లాభాల దిశగా వెళుతోంది. ఏరియాల వారీగా లవ్ స్టోరీ 12 రోజుల వసూళ్లు చూద్దాం.
నైజాం – 11.87 కోట్లు
సీడెడ్ – 4.24 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.87 కోట్లు
గుంటూరు – 1.48 కోట్లు
కృష్ణా – 1.34 కోట్లు
ఈస్ట్ – 1.57 కోట్లు
వెస్ట్ – 1.33 కోట్లు
నెల్లూరు – 0.84 కోట్లు
————————————-
ఏపీ + తెలంగాణ = 25.54 కోట్లు
————————————-
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.94 కోట్లు
ఓవర్సీస్ – 4.92 కోట్లు
———————————————-
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ = 32.34 కోట్ల షేర్
————————————————-