గత రెండు రోజులుగా అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-సమంత విడాకుల మ్యాటర్ ఎంత హాట్ టాపిక్ గా ఉందీ మనకు తెలిసిందే. ఏదో రూమర్స్ రూమర్స్ అంటూ కొట్టిపడేసిన వాళ్లకి ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చారు ఈ జంట. మేం విడిపోతున్నాం..దయచేసి మంల్ని గుట్టుగా బ్రతకనివ్వండి అంటూ ఓ పోస్ట్ చేసారు. ఇక అక్కడి తో మ్యాటర్ క్లోజ్ అయిపోయిందని అనుకున్నారు వాళ్ళు. కానీ, అసలు మ్యాటర్ అక్కడితోనే స్టార్ట్ అయ్యింది.
మేం విడిపోయాం..మమల్ని వదిలేయండి అంటే ఊరుకుంటారా అభిమానులు..?? అందుకు విడిపోయారు..అసలు మీ మధ్య గొడవలు ఏంటి..ఏదైన ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి గానీ ఇలా సినీ ఇండస్ట్రీలో ఓ స్టార్ స్టేఅటస్ ఉన్న మీరే ఇలా చేస్తే ఎలా అంటూ అడిగి కడిగి పారేస్తున్నారు నెటిజన్స్. అయినా వాళ్ళు మాత్రం ఏం స్పందించడంలేదు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు.
ఇక రోజుకో వార్త సంచలనంగా మారిన సమంత నాగచైతన్య ఇష్యూపై నటి మాధవిలత స్పందించింది. సమంత కి సపోర్ట్ చేస్తూ అక్కినేని ఫ్యామిలీని దుమ్మేతిపోసింది. తాజాగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన ఆవిడ మాట్లాడుతూ..”నేను చూస్తూనే ఉన్నాను చాలా మంది నాగచైతన్య సమంత విషయంలో సమంత కారణంగా విడాకులు వచ్చాయని ఆమెదే టోటల్ తప్పు అని కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అలా అనకండి. సమంత చాలా మంచి అమ్మాయి. మరీ ముఖ్యంగా పొట్టి బట్టల వేసుకోవడం వళ్ళ విడాకుల దాకా వెళ్ళింది అని కొందరు అంటున్నారు.
అది తప్పు.. కరెక్ట్ కాదు. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె లాంటి స్టార్ హీరోయిన్స్ చిన్న చిన్న బట్టలు వేస్తున్నారు.. అందుకని వాళ్ళ భర్తలు వాళ్ళను వదిలిపెట్టారా ? ..సమంత తిరుపతి మెట్లు ఎక్కి తన తాళిని కళ్ళకద్దుకుంది ఈ ఒక్కటి చాలదా ఆమె తన మ్యారేజ్ లైఫ్ కి ఎంత విలువిస్తుందో..? ఇక ఆ అక్కినేని ఫ్యామిలీ సమంతను ఓ డబ్బులు తెచ్చే మెషిన్ లానే చూసారు తప్ప ఆమెను మనిషిలానే చూడరు. కోట్లల్లో సంపాదిస్తే ఆమెకు కేవలం వేలల్లో పాకెట్ మనీ ఇచ్చేవారు. ముఖ్యంగా సామ్ కు పిల్లలు అంటే చాలా ఇష్టం.. 30 ఏళ్ల లోపే పిల్లలని కనాలని చాలా సందర్భాల్లో చెప్పింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు.. ఆమెను సినిమాలకే వాడుకొని, ఆమె ఆశను చంపేశారు’ అంటూ మాధవిలత ఘాటుగా స్పందించింది.