టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చాలా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతారు. ఆయన పనేదో ఆయన చేసుకోవడం మినహా బయట విషయాలు ఆయన పెద్దగా పట్టించుకోరు. నారప్పతో ప్రేక్షకులను మెప్పించిన వెంకీ దృశ్యం 2 సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక వెంకీ ఫ్యామిలీ గురించి కూడా బయటకు పెద్దగా ఏ విషయాలు రావు.
ఆయన భార్య నీరజ.. ఏపీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌కు స్వయంగా మేనకోడలు. వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు.. ఒక కొడుకు. కొడుకు కోసమే ముగ్గురు కూతుళ్లను కన్నాక కూడా వెయిట్ చేసి మరీ కొడుకును కన్నారు వెంకీ దంపతులు. వెంకీ కుమార్తెలు కూడా బయట పబ్లిక్ ఫంక్షన్లకు పెద్దగా రారు.
వెంకీ పెద్ద కుమార్తె ఎవరితోనో ప్రేమలో ఉందన్న వార్తలు అప్పట్లో దుమారం రేపాయి. చివరకు ఆమె ప్రేమ వివాహమే చేసుకుంది. తర్వాత రెండో కుమార్తె అశ్రిత సైతం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్. సుందర్ రెడ్డి మనవడితో ప్రేమలో ఉందన్న వార్తలు వచ్చాయి. అయితే సురేష్‌బాబు రంగంలోకి దిగి సుందర్ రెడ్డి ఫ్యామిలీతో మాట్లాడి వారి పెళ్లి చేశారు.
ఇక వెంకీ చిన్న కుమార్తె ప్రస్తుతం చదువుకుంటోంది. ఇక వెంకటేష్ కుమారుడు వయస్సు 19 సంవత్సరాలు.. ప్రస్తుతం చదువుకుంటోన్న తన కుమారుడిని ఇప్పట్లో సినిమాల్లోకి తీసుకు వచ్చే ఆలోచన వెంకీకి లేదంటున్నారు.