Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రేమ‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రేమ‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌..!

సోష‌ల్ మీడియా వ‌చ్చాక టాలెంట్ ఉంటే పాపుల‌ర్ అవ్వ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. చిన్న వీడియో చేసినా క్రియేటివిటీ ఉంటే పాపుల‌ర్ అయిపోతున్నారు. మ‌రి కొంద‌రు ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ లేదా సెన్షేష‌న‌ల్ న్యూస్‌తో హైలెట్ అవుతున్నారు. కొంద‌రు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.. ఈ లిస్టులోనే చేరారు యూట్యూబ‌ర్ స‌రయు రాయ్‌.

ఓ యూట్యూబ్ ఛానెల్లో బోల్డ్ వీడియోలు చేయ‌డం ద్వారా త‌క్కువ టైంలోనే తెలుగు నెటిజ‌న్ల‌కు బాగా దగ్గ‌ర‌య్యారు స‌ర‌యు. భారీ అంచ‌నాల‌తో బిగ్‌బాస్ ఐదో సీజ‌న్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు బిహేవియ‌ర్ న‌చ్చ‌ని వీక్ష‌కులు ఆమెను తొలి వారంలోనే ఇంటికి పంపేశారు. హౌస్లో కంటెస్టెంట్స్‌పై కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌లు చేసిన ఈ అమ్మ‌డు బ‌య‌ట‌కు వ‌చ్చాక బిగ్‌బాస్‌పై కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది.

ఆమె తాజా ఇంట‌ర్వ్యూలో తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పెద్ద ఫ్యాన్ అని.. ప‌వ‌న్ మేన‌రిజం చూసే తాను ఆయ‌న ప్రేమ‌లో ప‌డ్డాన‌ని బాంబు పేల్చింది. ఛాన్స్ వ‌స్తే ప‌వ‌న్ తో ఒక్క సినిమాలో హీరోయిన్‌గా చేయాల‌ని ఉంద‌ని చెప్పిన స‌ర‌యు.. తన‌కు చిన్న‌ప్ప‌టి నుంచే టాలీవుడ్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని తెలిపింది.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ఎవ‌రైనా కమిట్‌మెంట్ అడిగితే త‌న‌కు ఎంతో బాధ క‌లిగేద‌ని.. నా మొఖం అలా క‌నిపిస్తుందా ? అని అడిగేదానిని అని ఆమె వాపోయింది. చివ‌ర‌గా త‌న మెంటాల్టీకి త‌గిన వ్య‌క్తినే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది స‌ర‌యు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news