గత కొద్ది నెలలుగా సమంత బిహేవియర్‌తో విసిగి విసిగి పోయి ఉన్న నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చేయాలని నాలుగైదు నెలల క్రితమే ఫిక్స్ అయిపోయాడని తెలుస్తోంది. ఎందుకంటే చైతుతో సినిమాలు చేసేందుకు ఇద్దరు దర్శకులు లైన్లో ఉన్నారు. వీరు కరోనా టైం నుంచే చైతు చుట్టు తిరిగితే మనోడు చూద్దాం.. చేద్దాం అంటున్నారు. ఇటీవల వీరిలో ఒక డైరెక్టర్ కలిస్తే.. రెండు, మూడు నెలలు ఆగాలి.. తాను చాలా టెన్షన్లో.. ప్రాబ్లమ్‌లో ఉన్నానని చెప్పాడట. ఆ డైరెక్టర్ ఈ విషయాన్ని సన్నిహితులకు చెప్పడంతో అది ఇండస్ట్రీ అంతా పాకేసింది.
ఇక సమంతకు చెప్పి చెప్పి చూసి విసిగిపోయి విడాకులు నెలన్నర ముందే రెడీ అయిపోయి ఉన్నాడట. అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ రిలీజ్‌కు ముందే అదిరిపోయే అప్లాజ్‌ను సొంతం చేసుకుంది. తమ విడాకుల ప్రకటన ముందు వస్తే సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ పడుతుందని.. ప్రమోషన్లకు కూడా ఇబ్బంది అవుతుందనే విడాకుల ప్రకటన కాస్త ఆలస్యంగా చేసినట్టు తెలుస్తోంది.
ఇక సినిమా రిలీజ్ అయ్యి బంపర్ హిట్ టాక్‌తో దూసుకు పోతోంది. ఇక చైతు ప్రమోషన్లలో పాల్గొంటున్నా సినిమా రిజల్ట్ విషయంలో రిలాక్స్ అయిపోయి విడాకుల విషయాన్ని ఓపెన్ చేశాడు. ఇక గత కొద్ది నెలలుగానే సమంత చెన్నైలోనూ.. అప్పుడప్పుడూ హైదరాబాద్‌లోనూ ఉంటోంది. చైతు మాత్రం ఓ హోటల్లోనే ఉంటున్నాడు.