టాలీవుడ్ కింగ్ నాగార్జున ఏఎన్నార్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి అప్పుడప్పుడే స్టార్ హీరో అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఏఎన్నార్, రామానాయుడు స్నేహితులు కావడంతో వీరిద్దరు తమ పిల్లలకు పెళ్లి చేసి వియ్యంకులు కావాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే రామానాయుడు కుమార్తె శ్రీ లక్ష్మిని ఇచ్చి నాగార్జునతో పెళ్లి చేశారు. అయితే నాగచైతన్య పుట్టాక వీరి మధ్య గ్యాప్ రావడంతో విడాకులు తీసుకున్నారు.
వీరి విడాకులకు ప్రధాన కారణం అమలే అని అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడిచింది. అమలతో కొన్ని సినిమాలు చేసిన నాగార్జున ఆ క్రమంలోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అది నచ్చకే శ్రీలక్ష్మి నాగార్జునకు దూరమై చివరకు విడాకులు ఇచ్చిందంటారు. అందరూ ఊహించినట్టుగానే ఆ తర్వాత నాగార్జున – అమల పెళ్లి చేసుకున్నారు. అలా నాడు తన తల్లి శ్రీలక్ష్మి జీవితంలోకి వచ్చి తన తల్లిదండ్రులు విడిపోవడానికి కారణమైన అమలే నేడు చైతు తన భార్యకు దూరమవ్వడానికి కారణమైందని అంటున్నారు.
చైతు సమంత విషయంలో పూర్తిగా రాజీపడినట్టే తెలుస్తుంది. అయితే అమల పెట్టిన, పెడుతోన్న కండీషన్లు బాగా ఎక్కువ అవ్వడంతో సమంత తన ప్రైవసీకి భంగం కలిగిందని భావించింది. ఈ విషయంలో చైతు కూడా అమల, నాగార్జున మాటకే కట్టుబడి సమంతను నొప్పించేందుకు ప్రయత్నించాడు. ఇదే చివరకు ఇద్దరి మధ్య మనస్పర్థలు, అపోహలు పెరిగి విడిపోయేందుకు కారణమైంది. అలా నాడు తన తల్లికి, నేడు కొడుకుకు అమల ఎఫెక్ట్ గట్టిగానే పడిందని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.