నాగచైతన్య – సమంత అఫీషియల్‌గా విడిపోయారు. వీరిద్దరు విడిపోతారన్న పుకార్లు గత రెండు నెలల నుంచే వినిపిస్తున్నాయి. ఎప్పుడు అయితే సమంత తన సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి అక్కినేని అనే పదాన్ని తొలగించిందో అప్పటి నుంచి ఆమె వ్యవహరిస్తోన్న తీరు అంతా రకరకాల సందేహాలకు కారణమైంది. ఎట్టకేలకు సమంత – చైతు విడిపోయారు.
అయితే నెల రోజుల క్రిందటే వీరు కోర్టుకు వెళ్లగా… ఫ్యామిలీ కోర్టు కూడా చివరిగా కౌన్సెలింగ్ ఇచ్చి వీరిని కలిపేందుకు ప్రయత్నాలు చేసిందట. అయితే వారు ఒప్పుకోకపోవడంతో చివరకు కోర్టు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ తర్వాత చైతు , సామ్ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో వారు విడిపోతున్నట్టు ఒకేసారి ప్రకటించారు.
ఇక నెల రోజుల క్రిందట నుంచే వీరిద్దరు వేర్వేరుగా ఉంటూ వస్తున్నారు. చైతు అయితే నెల నుంచి హైదరాబాద్‌లోని ఓ హోటల్లోనే ఉంటున్నాడు. అక్కడ నుంచే లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లకు కూడా వస్తున్నాడు. దీనిపై మీడియాలో చాలా సందేహాలు ఉన్నా.. ఖచ్చితంగా ఇది విడాకుల వరకు వెళుతుందని చాలా మంది ఊహించలేకపోయారు.