టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య – సమంత తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. 2017, అక్టోబర్ 7న గోవాలో జరిగిన వివాహంతో ఒక్కటి అయిన ఈ దంపతులు నిన్న తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమాలో వీరిద్దరు కలిసి తొలిసారిగా జంటగా నటించారు. అది చైతుకు రెండో సినిమా. సమంతకు తొలి సినిమా. ఈ సినిమాతోనే సమంత కోలీవుడ్, టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
అనతి కాలంలోనే ఆమె ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు లాంటి స్టార్ హీరోలతో నటించి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఆ టైంలో ఆమె ఒక్కటే స్టార్ హీరోయిన్‌గా ఉండడంతో అవకాశాలు అన్నీ ఆమెకే వచ్చేశాయి. సమంత – చైతు ఇద్దరూ కూడా పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత కూడా తమ లైఫ్‌ను ఎంతో బాగా డిజైన్ చేసుకున్నారు. ఇక ఎంగేజ్‌మెంట్ నుంచి పెళ్లి వరకు వీరు దుస్తులను ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు.
ఇక పెళ్లిలో సమంత కట్టిన చీర గురించి అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ చీరను చైతు అమ్మమ్మ అంటే రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరి చీరనే రీ మోడలింగ్ చేయించి.. దానినే ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరీ కట్టుకున్నారట. ఇందుకోసమే సమంత రు. 40 లక్షల వరకు ఖర్చు చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిని ప్రముఖ డిజైనర్ క్రేశా బజాజ్ డిజైన్ చేశారు.