అక్కినేని వారసుడు నాగచైతన్యతో స్టార్ హీరోయిన్ సమంత విడాకులపై అధికారిక ప్రటకన వచ్చేసింది. చైతుతో విడాకుల వ్యవహారం ముగిశాక ఇప్పుడు అందరూ సమంతనే తప్పు పడుతున్నారు. నిదానంగా ఉంటూ ఎవ్వరి మనస్సును నొప్పించని నాగచైతన్యతోనే ఆమె కాపురం చేయలేదంటే.. ఆమె ప్రవర్తన ఎంత విపరీతంగా ఉండి ఉంటుందో ? అనే అంటున్నారు. నిజానికి సమంత గురించి ఇండస్ట్రీలో తెలిసిన వారు ఆమె బాగా ఇగోయిస్ట్ అని అంటారు. స్టార్ హీరోయిన్ అయ్యాక ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయిందట.
గతంలో నయనతారతో ఆమె తనకు తానే పోటీగా అభివర్ణించుకునేదట. అప్పట్లో నయన్ ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ మధ్య కోలీవుడ్‌లోనూ వార్ నడిచేది. ఇక ఇప్పుడు కూడా పూజా హెగ్డే ఫ్యాన్స్ వర్సెస్ సమంత ఫ్యాన్స్ మధ్య ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో వార్ నడుస్తూనే ఉంటుంది. ఇక చైతును ఆమె ప్రేమించి పెళ్లాడినా కూడా ఎప్పుడూ తనదే డామినేషన్ అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చేది. ఆమె పెడుతున్న ఫొటోలు, బయట మాట్లాడే మాటలు, ఇంటర్వ్యూలో చైతు గురించి వేసిన ప్రశ్నలకు ఇచ్చే ఆన్సర్లు ఇవన్నీ చూస్తుంటే తాను చెప్పినట్టే జరగాలన్నదే ఆమె సిద్ధాంతంగా కనిపిస్తోంది.
చైతు కూడా మజిలీ సినిమా ప్రమోషన్లలో సమంత తనను చాలా వరకు సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్స్ చేయాలని చూస్తుందని .. అది తనకు నచ్చదని చెప్పాడు. ఇక సమంత చైతు గురించి మాట్లాడుతూ చైతు ప్రతీది పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తాడని. అది కూడా తనకు నచ్చదని చెప్పింది. అంటే ఆమెకు పర్ఫెక్ట్గా ఉండడమే నచ్చదు. ఆమె చేస్తే అదే కరెక్ట్.. ఆమె ఏం చెపితే అదే రైట్ అన్నదే తన మనస్తత్వమన్నది అప్పుడే చెప్పకనే చెప్పేసింది.
ఇక సమంత వ్యక్తిగతంగా కూడా అంత పర్ఫెక్టా ? అని ప్రశ్నించుకుంటే కోలీవుడ్ హీరో సిద్ధార్థ్‌తో ఆమె ప్రేమాయణం తెలిసిందే. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. చివరకు ఆమె సిద్ధార్థ్‌తో కలిసి శ్రీ కాళహస్తి ఆలయంలో రాహు, కేతు పూజలు కూడా చేశారు. అయితే బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత కూడా ఓ టాప్ డైరెక్టర్‌తో ఆమె స్నేహ బంధం గురించి చాలా పుకార్లే వచ్చాయి.
అయితే చైతు మాత్రం ఫస్ట్ నుంచి సమంతను గుడ్డిగా నమ్మేసి ప్రేమించాడు. సమంత మాత్రం మధ్యలో చాలా దారులు వెతుక్కుని.. అవి సక్సెస్ కాక తిరిగి చైతు దగ్గరకు వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. చివరకు ఆమె నిలకడలేని మనస్తత్వం మరో సారి నిరూపించుకుందన్న విమర్శలే ఇప్పుడు వినిపిస్తున్నాయి.