ఇండస్ట్రీలో ఓ హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా చేసి హిట్ లేదా ఫట్ కొట్టడం కామన్‌గా జరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఓ హీరో వదులుకున్న సినిమా మరో హీరో చేసి హిట్ అయ్యాక.. ముందు దానిని వదులుకున్న హీరో అర్రే నేను చేసి ఉంటే హిట్ కొట్టేవాడినే అని ఫీలవుతూ ఉంటారు. అదే ప్లాప్ అయితే నా జడ్జ్మెంట్ కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే యువరత్న నందమూరి బాలకృష్ణ చేయాల్సిన ఓ కథను ఆయన మిస్ అవ్వడంతో అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సి వచ్చింది.
ఆ మాటకు వస్తే పవన్ చేయాల్సిన ఎన్నో సినిమాలు ఆయన వదులు కోవడంతో అవి వేరే హీరోలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టారు. మహేష్ బాబు పోకిరి కథ పూరీ జగన్నాథ్ ముందుగా పవన్ దగ్గరకే తీసుకు వచ్చాడు.
రవితేజకు హీరోగా ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఇడియట్ – అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు కూడా పవన్ వదులుకున్నాకే రవితేజ దగ్గరకు వచ్చాయి.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన సినిమా అన్నవరం. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఆశిన్ హీరోయిన్గా నటించగా.. పవన్ చెల్లి పాత్రలో ప్రేమిస్తే సంధ్య, బావగా శివబాలాజీ నటించారు. ఈ సినిమాను సిస్టర్ సెంటిమెంట్ ఉండడంతో పరుచూరి బ్రదర్స్ ఈ కథ బాలయ్యకు బాగా సెట్ అవుతుందని భావించారు.
ముద్దుల మావయ్య తర్వాత బాలయ్య సిస్టర్ సెంటిమెంట్ ఉన్న పాత్ర చేయలేదని.. ఇది ఆయనకు బాగా నప్పుతుందని అనుకున్నారట. అయితే తర్వాత ఈ కథ అటూ ఇటూ తిరిగి పవన్ వద్దకు చేరడంతో ఆయన నటించారు. అయితే భారీ అంచనాల మధ్య 2007 చివర్లో వచ్చిన అన్నవరం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అదే టైంలో ఎన్టీఆర్ నటించిన రాఖీ సైతం చెల్లి సెంటిమెంట్‌తోనే వచ్చి అది కూడా యావరేజ్ అయ్యింది