హాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ ప్రేమ కార్యకలాపాల గురించి గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. 45 ఏళ్లు దాటిన ఏంజెలీనా జోలీ భర్త బ్రాడ్ పిట్ తో 2019 లో విడి పోయిన తర్వాత ఆమె కొద్ది రోజులు సింగిల్ గానే ఉంది. ఆ తర్వాత ఆమె కెనడాకు చెందిన సింగర్ ది వీకెండ్ అబెల్ టెస్ఫాయె తో డేటింగ్ చేస్తున్నట్లుగా హాలీవుడ్ మీడియాలో ఒక్కటే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి బయట చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. అయితే వీరిద్దరు తమ ప్రేమ వ్యవహారాల గురించి ఇప్పటి వరకు ఎక్కడా నోరు విప్పలేదు.
తాజాగా వీరు యూరప్ లో చక్కెర్లు కొడుతున్నారు. హోటల్స్ లో గంటల తరబడి కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీరిద్దరు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతో న్న ఫొటోలు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ కొత్త ప్రేమ వ్యవహారం హాలీవుడ్ మీడియాలో హైలెట్ అవుతోంది. ఇక ఇప్పుడు వీరిద్దరు సహజీవనం చేస్తున్నారన్న వార్తలు కూడా జోరుగా చక్కెర్లు కొడుతున్నాయి.
ఏంజెలినా జోలీకి ఇప్పటికే ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆమె ఈ వయస్సులో కూడా ఈ ఆరుగురు పిల్లల బాధ్యతలను తీసుకుని వారికి ఇబ్బంది లేకుండా చూస్తోంది. ఇక ఏంజెలీనా ఏడేళ్ల క్రితమే హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ ను వివాహం చేసుకుంది. ఇద్దరు ఐదేళ్ల కాపురం చేసి విడిపోయారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు కలిగారు. ఇక ఆమె మరో ముగ్గురిని దత్తత తీసుకుంది.
ఇక ఇప్పుడు 45 ఏళ్ల వయస్సులో ఏంజెలీనా ప్రేమ కార్యకలాపాలు కొనసాగిస్తుండడం అంతర్జాతీయం గా కూడా సంచలన వార్తగా మారింది. ఇక ఈ జంట కలిసి ఉన్న ఫొటోలను కూడా ఎవరికి వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఏంజెలీనా కొత్త కాపురం ఎప్పుడో అంటూ క్యాప్షన్లు పెడుతున్నారు.