తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ రోజు అదే తెలుగు గడ్డపై ఓ సంచలనం అయిపోయారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఖుషీ సినిమా వరకు పవన్ నటించిన అన్ని సినిమలు బ్లాక్ బస్టరే. చాలా తక్కువ టైంలోనే పవర్ తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో పవర్ స్టార్ అయిపోయారు.
ఆ తర్వాత పవన్ రాజకీయాల్లోకి కూడా వచ్చారు. అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ 2014 ఎన్నికల వేళ జనసేన పార్టీ పెట్టారు. గత ఎన్నికలలో ఏపీలో ఆయనతో పాటు ఆయన పార్టీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి కూడా దిగింది. ఈ రోజు పవన్ సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్.
పవన్ రెమ్యునరేష్ ఇప్పుడు రు. 50 కోట్లు దాటేసింది. పవన్ తన తొలి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్నది ఎప్పుడూ ఆసక్తికరమే..! ఆ సినిమా నిర్మాత అల్లు అరవింద్ పవన్‌కు నెలకు ఖర్చుల కింద రు. 5 వేలు ఇచ్చేవారట. అలా ఆ సినిమా మొత్తం పూర్తయ్యే సరికి పవన్‌కు రు. 50 వేల రెమ్యునరేషన్ ఇచ్చారట. అది పవన్ తొలి సినిమాకు తీసుకున్న మొత్తం.. అదే ఇప్పుడు పవన్ ఒక్కో సినిమాకు రు. 50 కోట్ల పైనే తీసుకుంటున్నారు.