అటు రాజకీయాల్లోను ఇటు సినిమా రంగంలోను మాటాల యుద్ధం ఘాటుగా మొదలు పెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సాయి ధరం తేజ రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన హాట్ కామెంట్స్ టోటల్ ఇండస్ట్రీలో నే దుమారంగా మారాయి. మొత్తంగా సినిమా ఫంక్షన్ అని మర్చిపోయి.. టోటల్ పొలిటికల్ మీటింగ్ గా మార్చేసారు.
తన సినిమాలను కావలనే దెబ్బ తీయాలనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీని వై.ఎస్.జగన్ గవర్న్మెంట్ ఇబ్బందులకు గురి చేస్తుందంటూ..మండిపడ్డాడు. శనివారం సాయంత్రం జరిగిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జససేనాని పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మాట్లాడిన మాటలకు సినీ ఇండస్టృఈలో చాలా మంది ప్రముఖులు మద్దతు తెలిపారు. నాటురల్ స్టార్ నాని, కార్తికేయ వంటి స్టార్స్ హీరో మేమున్నాం మీతో కలిసి ముందడుగు వేస్తాం అంటూ మీడియా ముఖంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ ఇచ్చింది.
జరుగుతున్న పరిణామాలు దృష్ట్య ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ఓ లేఖను రిలీజ్ చేశారు. పరోక్షంగా పవర్ స్టార్ గురించి మాట్లాడుతూ స్టేజ్ ల పై వ్యక్తుల వ్యక్తం చేస్తున్న భావాలతో సినీ ఇండస్ట్రీకి సంబంధం లేదని ఘాటుగా స్పందించారు. మేను ప్రభుత్వంతో ఆల్రేడీ చర్చించామని వారు సానుకూలంగానే స్పందించారని ఆ లేఖలో పెర్కోన్నారు. ఇంకా ఆ లేఖలో..”గౌరవనీయులైన ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
జగన్ మోహన్ రెడ్డి గారు ఓపికగా అర్థం చేసుకోవడం మరియు మా ఆందోళనలన్నింటికీ సానుకూలంగా స్పందించడం అలాగే సమీప భవిష్యత్తులో మా ఆందోళనలన్నీ అనుకూలంగా పరిష్కరించబడతాయని హామీ ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు. వివిధ వ్యక్తులు తమ అభిప్రాయాలను మరియు ఆవేదనను వివిధ వేదికలపై వ్యక్తం చేశారు. ఇది పరిశ్రమ యొక్క అభిప్రాయం కాదు. సంవత్సరాలుగా మాకు ప్రభుత్వాలు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నాయి. వారి మద్దతు లేకుండా చిత్ర పరిశ్రమ మనుగడ సాగించలేము” అంటూ లేఖను రిలీజ్ చేసారు.