టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా ఆ నలుగురు అన్న టాపిక్ ఎక్కువుగా వినిపిస్తూ ఉంటుంది. ఇండస్ట్రీ తో పాటు థియటర్లు కేవలం నలుగురు చేతుల్లోనే ఉన్నాయంటూ చాలా మంది విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ నలుగురికి వ్యతిరేకంగా ఎన్నో సమావేశాలు, సంఘాలు పెట్టినా వారు దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. ఈ లిస్టులో దిల్ రాజు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. దిల్ రాజుపై ఇండస్ట్రీలోనే ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా ఉన్నారు. ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన ఎక్కడా వెనక్కు తగ్గకుండానే ముందుకు వెళ్లారు.
అయితే కొద్ది రోజులుగా ఆయనకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఇటు ఆయన నిర్మాతగా చేస్తోన్న సినిమాలు ఫట్ మంటున్నాయి. ఇక ఏపీలోనూ ఆయనకు భారీగా థియేటర్లు ఉండడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఉత్తరాంధ్రపై కొద్ది రోజులుగా ఆయన బాగా ఫోకస్ పెట్టి పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. ఎక్కడ అయినా ఏకచక్రాధిపత్యంతో ఉండే దిల్ రాజు ఇప్పుడు జగన్ ప్రభుత్వం దెబ్బతో దిగి వచ్చారనే చర్చ నడుస్తోంది.
ముఖ్యంగా ఏపీ మంత్రి పేర్ని నాని అయితే పవన్ కళ్యాణ్‌కు కౌంటర్‌గా పెట్టిన ప్రెస్‌మీట్లో దిల్ రాజును పదే పదే దిల్ రాజు రెడ్డి అంటూ ఓ ఆటాడుకున్నారు. పవన్ మాట్లాడుతూ ఉంటూ ఆయన మొఖం ఆముదం తాగిన వాడిలా అయిపోయిందని.. బిక్కచచ్చిపోయాడంటూ సెటైర్ వేశారు. ఇక కొద్ది రోజులుగా ఆయనపై వైసీపీ వర్గాలు కూడా గుర్రుగా ఉన్నాయన్న ప్రచారం ఉంది. అందులో భాగంగానే నాని కామెంట్లు ఉన్నాయంటున్నారు.
వకీల్‌సాబ్ సినిమా సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్న టైంలో ప్రభుత్వం సడెన్‌గా టిక్కెట్ రేట్లు తగ్గించింది. అప్పుడే రాజును గట్టిగా టార్గెట్ చేశారని టాక్ ? ఇక థియేటర్లు ఓపెన్ చేశాక కూడా ఉత్తరాంధ్రలో దిల్ రాజు థియేటర్లలో టిక్కెట్ రేట్ల విషయంలో లైట్ తీస్కొన్నారట. అయితే ప్రభుత్వం నుంచి సీరియస్‌గా ఆదేశాలు రావడంతో పాటు జేసీల ద్వారా ఎక్కడికక్కడ నిఘా పెట్టడంతో తన థియేటర్లలో ప్రభుత్వం రూల్స్ తూచా తప్పకుండా అమలు చేయాలని రాజు టీం ఆదేశాలు ఇచ్చినట్టు అంటున్నారు. ఏదేమైనా ఒక్క దిల్ రాజు మాత్రమే కాదు.. ఇప్పుడు అందరూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఏమీ అనలేక ఏం జరుగుతుందా ;? అని చూస్తున్నారు