Moviesపూర్తిగా కోలుకున్న నటుడు సాయిధరమ్ తేజ్.. డిశ్చార్జ్ ఎప్పుడంటే..?

పూర్తిగా కోలుకున్న నటుడు సాయిధరమ్ తేజ్.. డిశ్చార్జ్ ఎప్పుడంటే..?

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలు అవ్వడంతో సాయి ధరమ్ తేజ్‌ని వెంటనే దగ్గర్లోని మెడికవర్ ఆసుపత్రి లో ఎడ్మిట్ చేసారు. ఆ తరవాత అక్కడ నుండి అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది.

మూడు రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మరిచినట్లు తెలిపారు. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్‌ తొలగించినట్లు వైద్యబృందం వెల్లడించింది. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న సాయితేజ్, మాట్లాడగలుగుతున్నారని తెలిపింది. సర్జరీ నుంచి కోలుకుంటున్న ఆయన మరి కొన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందన్నారు అపోలో వైద్యులు సాయిధరమ్ కు సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు.

 

నిజానికి కేబుల్ బ్రిడ్జ్ మీద సాయిధరమ్ తేజ్ బైక్ కింద పడగానే ముందు ఎవరూ గుర్తు పట్టలేదు. కానీ.. అదే రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించి సాయి ధరమ్ తేజ్ ను పైకి లేపాడు. అతడి పేరే అబ్దుల్. అమీర్ పేటలోని ఎల్లారెడ్డి గూడకు చెందిన అబ్దుల్ సీఎంఆర్ సంస్థలో వ్యాలెట్ పార్కింగ్ లో జాబ్ చేస్తుంటాడు. ప్రమాదం జరిగిన రోజు వేరే పని మీద నిజాంపేట వెళ్తున్నాడు. అబ్దుల్ జూబ్లీహిల్స్, కేబుల్ బ్రిడ్జ్ మీదుగా జేఎన్టీయూ వెళ్తున్న అబ్దుల్ అదే సమయంలో అక్కడ తన కండ్ల ముందే ప్రమాదం జరగడాన్ని చూసిన అబ్దుల్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత 108 అంబులెన్స్‌కు కూడా ఫోన్ చేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news