ఇప్పుడు పవర్ స్టార్ ఒక ప్రభంజనం.. మీడియాలో ఈ నామస్మరణ లేని రోజు ఉండదేమో అనిపిస్తుంది. ఈరోజుల్లో ఈ పేరు వినపడని సినిమా కనిపించదేమో అనిపిస్తుంది. అటు సినిమాలు ఇటు రాజకీయం రెండింటిలోనూ బిజీ బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీ అయిన హార్వార్డ్ యూనివర్సిటీ నుండి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన పవన్ తన స్పీచ్ తో అందరిని అలరించటం తో పాటు.. తన జీవితంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు కూడా తెలిపి ఎంతో మందికి ఆదర్శవంతమైన మాటలు చెప్పారు.
తన స్పీచ్ లో భాగంగా చెప్పిన ఒక సంఘటన అందరిని కదిలించివేసింది.అదేంటంటే.. పవన్ కళ్యాణ్ ఒకసారి ఆత్మ హత్య చేసుకుందామని బాగా ఫిక్స్ అయ్యాడంట! అదేంటి.. మెగాస్టార్ తమ్ముడేంటి చని పోవాలనుకోవడమేమిటి అనుకుంటున్నారా ! కానీ ఇది నిజం! పవన్ కళ్యాణ్ తనకు తానుగా చెప్పిన బ్రతుకు నిజం!
ఎన్ని సార్లు రాసినా పరీక్షలు ఫెయిల్ అవుతుంటే ఒక సామాన్య విద్యార్ధి గా ఎంతో మానసిక క్షోభని అనుభవించి చివరకి లాభం లేదని చిరంజీవి లైసెన్సుడ్ పిస్టల్ తో తనని తాను పేల్చుకుని చనిపోవాలనుకున్నాడంట.. అయితే ఏదో మూలాన తన అన్నకి తన వలన చెడ్డ పేరు వస్తుందని భావించి ఆ నిర్ణయాన్ని అతి కష్టం మీద విరమించుకున్నాడంట. ఆ రోజు అలా చేసి ఉంటె.. ఊహించటమే కష్టం కదా !