Moviesలవ్ స్టోరీ సినిమాకి ఊహించని షాక్..తీవ్ర డిసప్పాయింట్ మెంట్ లో శేఖర్...

లవ్ స్టోరీ సినిమాకి ఊహించని షాక్..తీవ్ర డిసప్పాయింట్ మెంట్ లో శేఖర్ కమ్ముల..?

ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమాలోని ‘సారంగ దరియా’ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్క్డ చూసిన,ఎక్కడ విన్న ఈ పాట మారుమ్రోగిపోతుంది. ఇక ఈ సినిమాలో పాటలే ఈ విధంగా ఉంటే..మరి సినిమా ఏ రెంజ్ లో ఉంటుందో అని ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు ప్ర్ట్టుకున్నారు.

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై-సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా చైతు కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం..ఓసారి కరోనా కారణంగా..ఓసారి షూటింగ్స్ కారణంగా ఇలా పలుసారు ఈ సినిమా రిలీజ్ చేద్దామని చెప్పి మళ్లి పోస్ట్ పోన్ చేసారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు చిత్ర బృందం. ఈ నెల 24 న ఈ సినిమా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టిన చిత్రబృందం.. సెప్టెంబర్ 19 వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేయాలని డేట్ ఫిక్స్ చేసింది. ఆరోజు మెగాస్టార్ చిరంజీవిని కూడా ముఖ్యఅతిథిగా పిలిచింది. కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడ్డిందట. ఎందుకంటే.. మెగాస్టార్ చిరంజీవి అనుకోకుండా ఆ రోజున మరో ముఖ్యమైన పని పడడటం వల్ల.. పనికి షెడ్యూల్ చేయడంతో ఈ చిత్ర రిలీజ్ ఈవెంట్ కూడా పోస్ట్ ఫోన్ చేయక తప్పలేదట. దీంతో 21వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని సమాచారం. ‘ఫిదా’ తరువాత శేఖర్ కమ్ముల – సాయిపల్లవి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. దేవయాని .. రవి రమేశ్ .. పోసాని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news