Lifestyleఈ నాటి(10-02-2017) రాశి ఫలాలు మీ కోసం.....

ఈ నాటి(10-02-2017) రాశి ఫలాలు మీ కోసం…..

Check the zodiac sign predictions for today. These are all just estimating predictions and there are chances to be not true. All the best!

మేష రాశి వారికి:
ఇంజనీరింగ్ మరియు స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. పై స్థాయి అధికారులకు తమ కిందిస్థాయి సిబ్బందితో ఇబ్బందులు పెరుగుతాయి. మహిళలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు ఎక్కువవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేని వారు చేసే ప్రయత్నాలు సత్ఫాలితాన్నిస్తాయి.

వృషభం రాశి వారికి:
బట్టల వ్యాపారస్తులు, పసిడి, వెండి రంగాల్లోని వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది.ఈరోజు ఈ రాశివారు సంతానానికి సంబంధించిన విద్యా విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఈరోజు మనసుకు దగ్గరైన వారితో గడపండి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటికి దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కార్యసాధనలో పట్టుదల, ఓర్పు చాలా అవసరం.

మిథునం రాశి వారికి:
ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్లు, బదిలీల ప్రయత్నాలు ఈరోజు మొదలుపెడితే త్వరలోనే ఫలించేందుకు అనుకూలంగా ఉంది . ఈ రాశి వారు వారసత్వపు హక్కు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. విద్యార్థులకు ఒత్తిడి, మందలింపులు అధికమయ్యే ప్రమాదం ఉంది. మీరు చేసే ఖర్చుల విషయంలో తొందరపడకుండా లిమిటెడ్ గా ఖర్చు పెట్టాలి.

కర్కాటకం రాశి వారికి:
ఇంటి నిర్మాణాలు, మరమ్మత్తులు అనుకూలంగా ఉంది. చాలా కాలంగా వాయిదా పడుతోన్న పనులు మరల ప్రారంభిస్తారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలవారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. చమురు, మిరప, కంది వ్యాపారులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కనిపిస్తుంది. డబ్బుకి సంబందించిన విషయాల్లో ఊహించని మార్పు చోటు చేసుకుంటుంది. మీ పర్సనల్ విషయాలు బయటికి వ్యక్తం చేయకపోవడం మంచిది.

సింహం రాశి వారికి:
ఉద్యోగం చేసే వారికి బాధ్యతలు ఎక్కువవుతాయి. అప్పు తీసుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపలు, కోళ్ల పరిశ్రమలకు మంచి ఫలితాన్నిస్తాయి. మీ ప్రయాణాలు, కార్యక్రమాల్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత, కొత్త విషయాలపట్ల అవగాహన కలుగుతుంది. బ్యాంకుకి సంబందించిన విషయాలలో ఒత్తిడి ఎదుర్కోక తప్పదు.

కన్య రాశి వారికి:
భాగస్వాముల మధ్య తేడాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ మరియు ఎలక్ట్రానికల్ రంగాల్లో పనిచేసే వారు అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెళ్లి కానీ వారికి కలిసొచ్చే కాలం. ఫారెన్ వస్తువుల పట్ల మోజు పెంచుకుంటారు. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల చికాకులు ఎక్కువవుతాయి.

తుల రాశి వారికి:
మీకు నచ్చిన ప్రముఖులను కలుసుకుంటారు. ఊహించని అవమానాలు, అంతరాయాలు ఎదురవుతాయి. తల, ఉదరానికి సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. సంతానం విషయంలో మంచిగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేని వారు బ్రోకర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అమ్మకానికై చేసే ప్రయత్నాలు పోస్ట్ ఫోన్ చేసుకోవడం మంచిది.

వృశ్చికం రాశి వారికి:
ఉద్యోగుల ఏకాగ్రతా వైఫల్యం కారణంగా వారి పై అధికారులతో తిట్లు తింటారు. ఇంటికి అవసరమైన వస్తువులను స్త్రీలు కొంటారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలకు సంబందించిన వ్యవహారాలు చక్కబడతాయి. రిలేటివ్స్ నుండి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి వారికి:
బట్టల వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టి విజయం సాధించండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన పడతారు. రవాణా, టూరిజం రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో తలెత్తిన ఇబ్బందులను చాలా తెలివితో పరిష్కరించుకుంటారు.

మకరం రాశి వారికి:
బంగారం, వెండి వ్యాపార రంగాల్లోని వారికి పనివారితో ఇబ్బందులు తప్పేలా లేవు. ఉద్యోగులకు స్థిరత్వ లోపం వల్ల అధికారులతో తిట్లు తినవలసివస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా హాయినిస్తాయి . కొబ్బరి, పండ్ల మరియు పూల వ్యాపారులకు కలిసొస్తుంది. టీచర్లు ఒత్తిడి మరియు చికాకులు అధికమవుతాయి. భార్యా భర్తల మధ్య మాట పట్టింపులు, ఇబ్బందులు తలెత్తే అవకాశం చాలా ఉంది జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.

కుంభం రాశి వారికి:
లీజు, ఏజెన్సీ, ఉమ్మడి వ్యాపారులకు సంబంధించిన వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్య విషయాల్లో మీ సన్నిహితుల సహకారం అందుతుంది. బ్రోకర్లకు, ఏజెంట్లకు మంచి అవకాశాలు ఉంటాయి. స్త్రీలు దూర ప్రయాణాలు, షాపింగ్ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం రాశి వారికి:
ఉద్యోగుల ఏకాగ్రతా వైఫల్యం కారణంగా వారి పై అధికారులతో తిట్లు తింటారు, పై అధికారులతో సంభాషించేటప్పుడు ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్మాణానికి సంబందించిన పథకాల్లో చురుకుదనం కానవస్తుంది. ఖర్చులు ఎక్కువైన సమయానికి డబ్బు అందడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. చేతి పనుల వారికి మంచి గుర్తింపు, అభివృద్ధి లభిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news